ఒక స్టార్‌ మాట్లాడే మాటలేనా ఇవి?

మెగా ఫ్యామిలీ నుండి హఠాత్తుగా హీరోగా అల్లు శిరీష్‌ ఊడిపడ్డాడు. బిజినెస్‌ అంటే అభిరుచి ఉండటంతో నిర్మాణం మరియు బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటాడని అల్లు శిరీష్‌ గురించి అంతా అనుకున్నారు. కాని ఉన్నట్లుండి ఒకరోజు హీరో అవుతాను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఒకటి అర తప్ప కమర్షియల్‌ సక్సెస్‌లను అందుకోలేక పోయాడు. అయినా కూడా బ్యాక్‌గ్రౌండ్‌ గట్టిగా ఉండటంతో హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు.

తాజాగా ఈయన ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఇండియన్‌ సాంప్రదాయాలకు విరుద్దంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు శిరీష్‌ ఏమన్నాడంటే.. ట్విట్టర్‌లో ఒక అభిమాని మీకు అన్ని అందంగా కనిపిస్తున్నాయి, ఇలాంటి సమయంలో మీరు పెళ్లి చేసుకోవడం ఉత్తమం బయ్యా అంటూ ట్వీట్‌ చేశాడు. అందుకు శిరీష్‌ విభిన్నంగా స్పందించాడు. పెళ్లి ఎందుకు సార్‌ ఇప్పటికే వర్షం, ట్రాఫిక్‌తో సమస్యలు, రొమాన్స్‌కు పెళ్లి అవసరం లేదు. రిలేషన్‌ షిప్‌ ఉంటే రొమాన్స్‌కు కొదవలేదు అంటూ రీ ట్వీట్‌ చేశాడు.

శిరీష్‌ వ్యాఖ్యలు చూస్తుంటే పెళ్లిపై సదాభిప్రాయం ఉన్నట్లుగా లేదు. ఫారిన్‌లో మాదిరిగా పెళ్లి చేసుకోకుండా రిలేషన్‌ షిప్‌ అంటూ అమ్మాయిలను మార్చుతూ ఉంటాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి శిరీష్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.

To Top

Send this to a friend