చంద్రుడి గురించి మీకు తెలియని ఓ రహస్యం..


చందమామ.. నిండు పున్నమిన ఆకాశంలో చల్లని వెన్నెలను పంచుతాడు. ఎందరో కవులు నిండు జాబిలి గురించి ఎన్నో పర్యాయాలు కవితలు, పాటలు రాశారు. నిజానికి చంద్రబింబం అంత కాంతివంతంగా ఉండడానికి అక్కడి నేలలు, శిలలే కారణం.. అక్కడ మనలా వాతావరణ వ్యవస్థ లేకపోవడంతో చంద్రుడు సూర్యకాంతిని గ్రహించి వదులుతూ మనకూ బింబంలా కనిపిస్తాడు.

చంద్రుడు నుండి వచ్చే వెన్నెల చల్లదనాన్ని మనం అనుభవిస్తుంటాం.. వాస్తవానికి చంద్రుడు చల్లనిరాజు మాత్రం కాదని పరిశోధనల్లో తేలింది. పట్టపగలు చంద్రుడి మీద నీరు మరిగేటంత ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి గడ్డకట్టుకు పోయేటంత చలి ఉంటుంది. సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది. కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో కొంత కాంతినే మనం వెన్నెలగా చూస్తాము.

చంద్రుడి మీద నీడ నిచ్చేందుకు మేఘాలు, చెట్లు, వాతావరణం లేవు. మనకు ఒకరోజులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే చంద్రుడి స్లోగా భూమి చుట్టు తిరుగుతాడు కాబట్టి దాని రోజు సమయం చాలా ఎక్కువ. అక్కడ పగలు దాదాపు రెండు వారాలు , రాత్రి మరో 2 వారాలు ఉంటుంది. నిజానికి చంద్ర్డుడు తనకు తాను మాడిపోతూ మనకు మాత్రము చల్లని వెన్నెల అందిస్తూ మనచేత వెన్నెల జాబిలి అనిపించుకుంటాడు.

To Top

Send this to a friend