‘డీజే’ చరిత్రలో సుమకు ఒక పేజీ


మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘డీజే’. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఈనెల 23న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ఆడియో వేడుకను తాజాగా వైభవంగా నిర్వహించడం జరిగింది. మెగా ఫ్యామిలీ హీరోలు ఎంతో మంది రావడంతో పాటు, మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ ప్రముఖులు చాలా మందే వచ్చాయి. ఈ కార్యక్రమంకు సుమ యాంకర్‌గా వ్యవహరించింది.

‘డీజే’ చిత్రం ఆడియో వేడుకకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సుమకు చిత్ర నిర్మాత దిల్‌రాజు, చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌లు షాక్‌ ఇచ్చారు. చిత్రంలోని ఒక పాటను సుమతో విడుదల చేయించాలని భావించారు. సినిమాలోని ఒక పాటను సుమను విడుదల చేయమనగా, ఆమె షాక్‌ అయ్యింది. ఆ తర్వాత తేరుకుని చిత్రంలోని ఆ పాటను విడుదల చేయడం జరిగింది. సుమ ఆ తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఎన్నో ఆడియో వేడుకలు దగ్గరుండి జరిపించాను. కాని ఇలా ఒక సినిమా పాట విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని, ‘డీజే’ చిత్రం సృష్టించబోతున్న చరిత్రలో తనకు ఒక పేజీ ఉంటుందని తనదైన శైలిలో మెగా ఫ్యాన్స్‌ను ఉత్తేజ పర్చింది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం ఖాయంగా కురిపిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

To Top

Send this to a friend