‘మంత్రాలకు’ ప్రాణాలే పోతున్నాయి..

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో ఏమో తెలియదు.. కానీ ప్రాణాలు మాత్రం పోతున్నాయి. మనిషి చంద్రుడిని తాకాడు. అంతరిక్షంలో గూడు కట్టుకున్నాడు. మనిషి ఆవిష్కరణలు గురు గ్రహాన్ని, అంగారకుడిని తాకి సమాచారాన్ని ఇస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లతో మనిషి జీవితమే ఇంటర్నెట్ తో ముడిపోయింది. ఇంతలా మనిషి దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో మూఢనమ్మకాలు గూడుకట్టుకొని ప్రాణాలు పోతుండడం కలవరపరుస్తోంది..

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని గంగిరెద్దుల కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగిరెద్దుల కాలనీకి చెందిన ఘంటా కొమరయ్య(36)కు హుస్నాబాద్‌ మండలం కొండాపూర్‌కు చెందిన కొమరమ్మ(34)తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎల్లమ్మ(10), కొమరమ్మ(8), అంజమ్మ(6) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇటీవల కొమరయ్య మంత్రాలు, చేతబడులు చేస్తున్నాడనే నెపంతో కొమరమ్మ పుట్టింటి వారు అతడి కుటుంబాన్ని హుస్నాబాద్‌కు పిలిపించి వారిపై దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన కొమరయ్య దంపతులు ఆదివారం రాత్రి ముందు పిల్లలకు ఉరి వేసి అనంతరం వారు ఉరేసేకుని బలవన్మరణం పొందారు. సోమవారం ఉదయం వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇలా మంత్రాలకు ఓ కుటుంబ బలైపోయింది. సమాజంలో ఇంకా మూఢనమ్మకాలున్నాయని ఈ దుర్ఘటన రుజువు చేసింది..

To Top

Send this to a friend