సూసైడ్ లేఖ వైరల్.. అమ్మాయి మోసంపై..

ట్రెయిన్ రివర్స్ అవుతోంది. అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను ఆడుకోవడం లేదు. కొందరు అమ్మాయిలే జల్సాలకు అలవాటు పడి మగాళ్లతో ఆడుకుంటున్నారు. ఇలా ఓ అమ్మాయి మోసానికి బలైపోయిన నరేశ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునే ముందు అతడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. నరేశ్ ప్రేమ కథ జరిగిన తీరును వివరించగా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. న‌రేష్ చిన్నా అనే యువ‌కుడు నాలుగేళ్లుగా శ్వేత అనే అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడు.త‌నే లోకంగా భావించిన న‌రేష్ ఆమె కోసం జీవితానికి జీతామిచ్చే ఉద్యోగాన్ని కూడా వ‌దులుకోని పిచ్చోడిలా ప్రేమ‌లో మునిగిపోయాడు.కానీ ఆ అమ్మాయి మాత్రం అవ‌స‌రాల‌కు ప‌నికొచ్చే ప‌నోడిగా భావించి వాడి ప‌డేసింది.చివ‌రికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవ‌టం లేదంటూ న‌రేష్ ను సైడ్ చేస్తూ వ‌చ్చింది.కానీ ఆమెను మ‌రిచిపోవ‌టం త‌న వ‌ల్ల కాలేదు.

ఈ నెల 7వ తేదీన శ్వేత పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌లుద్దామ‌ని మెసేజ్ పెట్టాడు.కానీ త‌న అన్న‌య్య వ‌స్తున్నాడ‌ని,మార్నింగ్ వీలు కాద‌ని చెప్పింది.కాక‌పోతే సాయంత్రం క‌లుద్దామ‌ని చెప్పింది.ఇక అప్ప‌టివ‌ర‌కు ఆమెను చూడ‌కుండా ఉండ‌టం త‌న వ‌ల్ల కాని న‌రేష్ స‌రాస‌రి ఆమె ఉండే హాస్ట‌ల్ వ‌ద్ద‌కు వెళ్లాడు.అక్క‌డ మ‌రో యువ‌కుడితో కులుకుతూ క‌నిపించింది శ్వేత‌.అన్నయ్య అయితే సొంత పెళ్లాంలా నడుంపై చేయి ఎందుకు వేస్తాడు.ఆమె కూడా అంత క్లోజ్ గా ఎందుకు ఉంటుంది.దీన్ని బట్టిచూస్తే ఆ అమ్మాయి మరొకడితో ప్రేమలో ఉందని తెలుస్తుంది.అతడి కారణంగా గతంలోనూ శ్వేత-నరేష్ లమధ్య గొడవలు సంభవించాయి.మొత్తానికి మోసపోయాడని క్లియర్ కట్ గా అర్థమైంది.

దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన న‌రేష్ ప్రేమ‌పై అస‌లు నిజాన్ని,అసలు మోసాన్ని తెలుసుకున్నాడు.ప్రేమ పేరుతో అబ్బాయిల‌ను అమ్మాయిలు ఏ విధంగా వాడుకుంటున్నారో జ‌నాల‌కు తెలియాల‌ని,ముఖ్యంగా అమ్మాయిల త‌ల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల‌ని భావించిన న‌రేష్ అమ్మానాన్న‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తూ రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

అంతే కాదు,అస‌లు లోకంలో ప్రేమ‌కు రెండు ర‌కాల రూల్స్ వున్నాయ‌ని,అమ్మాయిలైతో ఒక‌లా,అబ్బాయిలైతే మ‌రోలా ట్రీట్ చేస్తున్నార‌ని మెసేజ్ లో పేర్కొన్నాడు న‌రేష్.అమ్మాయిలు నిజంగా ప్రేమించే అబ్బాయిల‌ను న‌మ్మ‌టం లేద‌ని,వాడుకుని మ‌ర్చిపోయే వాళ్ల వెంటే ప‌డుతున్నార‌ని స్ప‌ష్టం చేశాడు.
ఇక న‌రేష్ ప్రేమించిన శ్వేత‌తో పాటు,ఆ అమ్మాయి సోద‌రి ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా త‌ప్పు ప‌ట్టాడు.అలాగే శ్వేత‌తో పాటు హాస్ట‌ల్ లో ఉండే అమ్మాయిల ప్ర‌వ‌ర్త‌న‌పై కూడా రియాక్ట్ అయ్యాడు.త‌ప్పుడు ప‌నులు చేస్తున్నారంటూ చెప్పాడు.కానీ న‌రేష్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ప‌ట్ల త‌న స్నేహితులు,మిత్రులు,బంధువులు,కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇంత‌గా ఆలోచించిన న‌రేష్ చ‌నిపోయే ముందు త‌న త‌ల్లిదండ్రుల వేద‌న‌ను కూడా ముందే ఊహించి ఉంటే సూసైడ్ చేసుకునే వాడు కాదేమో.అమ్మాయి మోసానికి బ‌లైన న‌రేష్ ని చూసైనా నిజంలేని ప్రేమ‌లో మునిగి తేలుతున్న యువ‌కులు ఇంకెంతో మంది ఉన్నారు.వారంతా ఆలోచించి అర్థం చేసుకుంటే మంచిది.ఇక అబ్బాయిలు కూడా కొంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు.కాబ‌ట్టి, అమ్మాయిలు,అబ్బాయిలు ప్రేమ దోమ కుట్ట‌క‌ముందే జాగ్ర‌త్త ప‌డితే బెట‌ర్.లేదంటే మీ ఫ్యామిలీ మీకోసం ఎప్పుడు ఏడుస్తూనే ఉండాల్సి వ‌స్తుంది.

To Top

Send this to a friend