వైసీపీ రియల్ ఎస్టేట్ కలలు కల్లలు కావడానికి నవ కారణాలు..

వైసీపీ రియల్ ఎస్టేట్ కలలు కల్లలు కావడానికి నవ కారణాలు..(నవరత్నాలు)
అమరావతి నుండి రాజధాని విశాఖపట్నం కి తరలించి అక్కడ తాము కొనుగోలు చేసిన భూముల ధరలు పెంచుకోవాలి అని వైసీపీ నేతలు కన్న కలలు సాకారం అయ్యేటట్లు కనబడడం లేదు,విశాఖపట్నం లో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించినా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ కనబడడంలేదు.

అక్కడ భూములు కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం లేదు.
అందుకు నవ కారణాలు(9) ముఖ్యంగా కనబడుతున్నాయి.
(1)రాజధాని విశాఖపట్నం కి తరలింపునకు అనేక న్యాయ పరమైన అవరోధాలు
(2)రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిదారులైన టీడీపీ లోని ఒక ప్రధాన సామాజిక వర్గం ఆసక్తి కనబరచక పోవడం.
(3) అమరావతి లో రైతులకు జరుగుతున్న అన్యాయం తమకు కూడా జరుగుతుంది అని విశాఖపట్నం రైతుల అనుమానం.

(4)జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే విశాఖపట్నం నుండి అదాని డాటా సెంటర్,లులు గ్రూప్ వెళ్లిపోవడంతో పెట్టుబడిదారుల వెనుకంజ.
(5)వైసీపీ పాలనలో మితిమీరిన భూ కబ్జాలు,లాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలు,రాయలసీమ రౌడీ ముఠాల దౌర్జన్యాలు.
(6)జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉండదు , ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హైదరాబాద్ లో భూముల ధరలు పెరుగుతూ ఉండడం తో ఆంధ్రప్రదేశ్ లో ధనవంతులు కూడా అక్కడ భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
(7) ఎన్. ఆర్ .ఐ లలో జగన్మోహన్ రెడ్డి పై సదభిప్రాయం లేకపోవడం.సొంత రాష్ట్రం పై ప్రేమతో అమరావతి లో పెట్టుబడులు పెట్టిన తమకు వైసీపీ అన్యాయం చేసింది అని భావిస్తున్నారు.
(8)కొత్త ప్రభుత్వం వస్తే విశాఖపట్నం నుండి తిరిగి అమరావతి కి రాజధాని తరలింపు ఖాయం అని నమ్మకం.బీజేపీ,జనసేన,టీడీపీ,కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతు అమరావతి కే ఉండడం.
(9)దేశ,రాష్ట్ర ఆర్ధిక మంద గమనం వల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గడం.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend