89శాతం పత్రికలు చదవడానికే!

పదేళ్ల కిందటి వరకు ఆరోజు ఏం జరిగిందో తెల్లవారి పేపర్ వస్తేనే తెలిసేది.. వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపై అందరూ పేపర్ కొని గంటలపాటు దానితోనే సహవాసం చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పేపర్ కొని చదివే ఓపిక ఉండట్లేదు.. ఐదేళ్ల క్రితం వరకు పేపర్ ను దాటి.. న్యూస్ చానాళ్లు చేరువయ్యాయి. లైవ్ ప్రొగ్రాంతో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో అప్ డేట్ ఇచ్చేవి. ప్రస్తుతం న్యూస్ చానాళ్లకంటే ఫాస్ట్ గా సోషల్ మీడియా జనాలకు చేరువవుతోంది. ఎక్కడ ఏదీ జరిగినా సోషల్ మీడియాలో వార్త క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. ఫలానా చోట ఇలా జరిగిందంటూ వెంటనే జనాలకు తెలిసి పోతోంది.. మరి ఈ మూడు ఆయా కాలాల్లో అవే అగ్రస్థానంలో ఉన్నాయి. పత్రికలు, న్యూస్ చానాళ్లు, ఇప్పుడు సోషల్ మీడియా.. మరి ఈ మూడింటిలో జనాలకు ఏదీ అంటే ఎక్కువ ఇష్టం.. ఎందులో చదవాడినికి జనాలు ఇష్టపడతారు.. అనే దానిపై యూరప్ లోని మ్యూనిక్ ఎల్ఎంయూ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. అందులో విస్తు గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.
ఎన్నేళ్లయినా.. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా అరచేతిలోని సెల్ ఫోన్లలో ప్రపంచం మొత్తం కనిపిస్తున్న సరే జనాలకు పత్రికలంటేనే బాగా ఇష్టమని.. అందులో చదివితేనే వారు సంతృప్తి పడతారని సర్వేలో తేలింది. పాఠకులు వార్తల కోసం రోజులో కేటాయించే సమయంలో 89శాతం పత్రికలు చదవడానికే ఇష్టపడతారట.. ఆన్ లైన్ పత్రికలు చూడడానికి 4శాతం, సోషల్ మీడియా వార్తలకు 7శాతం సమయం వెచ్చిస్తున్నట్టు తేలింది. వాట్సాప్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో వార్తలు తెలుసుకోవడానికి కొద్దిసమయమే కేటాయిస్తారని.. అదే పత్రికలు కనపడితే ఎక్కువ సమయం వెచ్చిస్తారని సర్వేలో తేలింది.దీని ద్వారా ప్రపంచంలో ఎంత డిజిటల్ వ్యాప్తి జరిగినా ఇప్పటికీ అగ్రశ్రేణి పత్రికలకు ఆదరణ తగ్గడం లేదని సర్వేలో తేటతెల్లమైంది. సోషల్ మీడియా, న్యూస్ చానాళ్లు వచ్చినా సరే.. పత్రికలు చదవడానికి పాఠకులు రోజులో సరాసరి 40 నిమిషాలు వెచ్చిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అవే డిజిటల్ ఫేస్ బుక్, వాట్సాప్ ఇతర వాటిల్లో కేవలం నిమిషం మాత్రమే వెతుకుతున్నట్టు తేలింది. ఈ అధ్యయంనలో 2015-16 సంవత్సరంలో 11 ప్రఖ్యాత పత్రికల రీడిర్ షిప్, సోషల్ మీడియా, న్యూస్ చానాళ్లను పరిశోధించి ఈ వాస్తవాలను బయటపెట్టారు పరిశోధకులు.. సో ఇప్పటికీ మరెప్పటికైనా పత్రికలకే జనాల ఓటు అని తేలిపోయింది..

To Top

Send this to a friend