8 కోట్ల వ్యూస్ .. సాహో బాహుబలి

బాహుబలి2 ట్రైలర్ విడుదలైన 8 గంటల్లోనే కోటి వ్యూస్ వచ్చి మునుపెన్నడూ ఏ సినిమా అందుకోని రికార్డును నెలకొల్పింది. రాజమౌళి చెక్కిన ఈ శిల్పం గంటగంటకు రికార్డులు తిరగరాస్తోంది. గురువారం ఉదయం రాజమౌళి అండ్ టీం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన 8 గంటల్లో తెలుగు వెర్షన్ కు కోటికిపైగా వ్యూస్ రావడం ఇదో సంచలనం..

సౌత్ ఇండియా అగ్రనటుడు రజనీకాంత్ నటించిన కబాలి ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు అదే పెద్ద సెన్షేషనల్ న్యూస్ కానీ ఇప్పుడు బాహుబలి కేవలం 5 గంటల్లోనే ఆ రికార్డును అధిగమించింది. సినిమా విజువల్, ఎమోషనల్ వండర్ లా సాగడం.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయాన్ని మరింత క్యూరియాసిటీ పెంచేలా రాజమౌళి ట్రైలర్ లో చూపించడంతో జనం ట్రైలర్ కు బ్రహ్మరథం పడుతున్నాడు. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్ష్ అయితే రాజమౌళి మేధావి అంటూ కీర్తించాడు. ఈనెల 25న బాహుబలి2 ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది.

To Top

Send this to a friend