వెయ్యికి ముందు ఆరు వందల కోట్ల చిత్రం


మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ భీముడిగా మహాభారతంను ఒక ప్రముఖ నిర్మాత నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ముఖ్యంగా మోడీ నుండి సపోర్ట్‌ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఆ సినిమా ప్రారంభంకు ముందే మోహన్‌లాల్‌ మరో భారీ బడ్జెట్‌ సినిమాను కమిట్‌ అయ్యాడు. 600 కోట్లతో తెరకెక్కబోతున్న ‘ఓడియన్‌’ అనే మలయాళ సినిమాలో మోహన్‌లాల్‌ నటించబోతున్నాడు.

మలయాళ సినిమా అంటే 30 కోట్ల బడ్జెట్‌ పెట్టడం అంటేనే మరీ ఎక్కువ. అలాంటిది 600 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక్క తమిళం మాత్రమే కాకుండా తెలుగు, తమిళం ఇంకా ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇంత భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుందట. మోహన్‌లాల్‌ కెరీర్‌లో ఎప్పుడు కనిపించని విధంగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇంత బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తే వర్కౌట్‌ అవుతుందా అనేది అనుమానంగా ఉంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బడ్జెట్‌ రికవరీ కాదు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend