ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తే రూ.50వేల జరిమానా


స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ అనుకునే రోజులు. సర్కారీ బడులను హేళనగా చూసే రోజులు. స్మార్ట్ లుక్ ఉండదని.. టీచర్లు పట్టించుకోరని.. అవి కేవలం వీధిబడులు మాత్రమేనని అనుకునే రోజులు. అలాంటి సమయంలో ఇదిగో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి.. లేదంటే భారీ జరిమానా తప్పదంటూ ఆ గ్రామమంతా తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లపై ఎంత మమకారం ఉండాలి. గవర్నమెంట్ స్కూళ్లను బతికించుకోవడానికి.. ఆగ్రామం చూపిన సాహసం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని పోతారం గ్రామం ఈ ఆదర్శానికి బాటలు వేసింది. గ్రామమంతా ఒక్కటై.. తమ గ్రామం నుంచి ప్రైవేట్‌ పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. కులసంఘాల వారీగా సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్‌ సిరికొండ కవితకు తీర్మాన పత్రాలను అందించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూతపడే పరిస్థితి నెలకొనడంతో ఈ సమష్టి నిర్ణయం తీసుకున్నారు.

To Top

Send this to a friend