తెలుగు హీరో ఆఫీస్‌లో 5 కోట్ల పాత నోట్లు


కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం అంటూ కేంద్ర ప్రభుత్వం జీవోను కూడా తీసుకు వచ్చింది. అయితే తాజాగా టాలీవుడ్‌ హీరో రాజశేఖర్‌ ఆఫీస్‌లో భారీ మొత్తంలో పాత నోట్లు పట్టుబడ్డట్లుగా ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు జోరుగా వస్తున్నాయి. ప్రముఖ మీడియాల్లో కూడా ఈ విషయమై వార్తలు వచ్చాయి.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జీవిత రాజశేఖర్‌ ఆఫీస్‌లో పోలీసులు 5 కోట్ల నగదును స్వాదీనం చేసుకున్నారన్న వార్త దావాణంలా వ్యాప్తి చెందుతుంది. టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీసర్ల సమక్షంలో పోలీసులు ఆ మొత్తంను జప్తు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆ సమయంలో ఆఫీస్‌లో జీవిత మరియు రాజశేఖర్‌లు లేక పోవడంతో అక్కడ ఉన్న శ్రీనివాస్‌ మరియు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజేపీతో మరియు రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా కేసును నీరు గార్చే అవకాశాలున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend