23ఏళ్ల అమ్మాయితో 45 ఏళ్ల డైరెక్టర్ డేటింగ్..


బాలీవుడ్ లో ఏదైనా సాధ్యమే.. ప్రేమలు, పెళ్లిళ్లు అక్కడ కామన్. తమ ఏజ్ వయసువారితో రోమాన్స్ ను ఎవరూ కాదనరు.. అయిదారేళ్లు ఎక్కువ తక్కువైనా కానీ వార్త కాదు. కానీ వయసు తేడా రెట్టింపు అయితే అది వార్త అయ్యి కూర్చుంటుంది. తన కూతరు వయసున్న అమ్మాయితో దర్శకుడు అనురాగ్ డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని విడాకులిచ్చిన అనురాగ్ ముచ్చటగా మూడో అమ్మాయితోనైనా సంతృప్తి చెందుతాడో లేక మరో పెళ్లి ప్రేమ కొనసాగిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది..

సీనియర్ బాలీవుడ్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో పేరు సంపాదించిన అనురాగ్ కశ్యప్ కు ఇదివరకే రెండు సార్లు పెళ్లి అయ్యింది. ఇద్దరు భార్యలతో వివాహమై.. వారితో విడాకులు కూడా అయ్యాయి. మొదటి భార్య కూతురుకు 21 ఏళ్లుంటాయి. కానీ ఈ అనురాగ్ మరోసారి ముచ్చటగా మూడో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట.. ఆమె ఏజ్ ఎంతో తెలుసా 23. పేరు శుభ్రాశెట్టి.. అనురాగ్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోంది. అందంతో కవ్వించిందో ఏమో కానీ అనురాగ్ ఈ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. అదీ అతడి కూతురంత వయసున్న అమ్మాయితో.. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది.

‘దేవ్ డీ’, ’నో స్మోకింగ్’, గాంగ్స్ ఆఫ్ వసేపూర్ వంటి చిత్రాల్లో సునిశిత, ఎవరూ టచ్ చేయని అంశాలను లేవనెత్తి కళాత్మక దర్శకుడిగా అనురాగ్ పేరుతెచ్చుకున్నారు. మానవీయ కోణాల్ని ఆవిష్కరించడంలో అనురాగ్ ది అందవేసిన చెయ్యి. రోటీన్ కు భిన్నంగా సినిమాలు తీసే అనురాగ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా అంతే భిన్నంగా ఆలోచించాడు. 23 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.

To Top

Send this to a friend