సామ్ సంగ్ కే బురడీ ..


ఒకటి కాదు రెండు కాదు వందల సామ్ సంగ్ హ్యాండ్ సెట్లు మాయమయ్యాయి. సామ్ సంగ్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి సామ్ సంగ్ ఫోన్లను కొట్టేసి బయట అమ్మి సొమ్ము చేసుకున్నాడు. వాటి విలువ ఎంతో తెలిస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే..

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సామ్ సంగ్ పాత ఫోన్ల నిర్వహణను పర్యవేక్షించే ఉద్యోగంలో చేరిన ఒక ఉద్యోగి అవకాశం దొరికినప్పుడల్లా స్మార్ట్ ఫోన్లు దొంగిలించి తన వీల్ చైర్ కింద దాచుకునేవాడని తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా వాటిని బయటకి తరలించి తర్వాత సెకండ్ హ్యాండ్ రిటైర్లకు అమ్ముకునేవాడట..

ఈ విషయాన్ని గమనించిన సామ్ సంగ్ కంపెనీ చివరకు ఫోన్ల మాయంపై గమనించి… ఉద్యోగిని గుర్తించింది. దొంగిలించిన మొత్తం విలువ అక్షరాల 4.5 కోట్లు అని తేల్చింది. ఇంత భారీ దొంగతనాలు చేసిన సదురు ఉద్యోగి ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

To Top

Send this to a friend