3 టికెట్లు.. 36 లక్షలు.. చిరు సినిమా టికెట్ల డబ్బులు చారిటీ సేవలకు!

ఓ మంచి పని కోసం చిరంజీవి తన చిత్రాన్ని వినియోగించుకొని వేలాది మంది అభాగ్యులకు వెలుగులు పంచుతున్నాడు.. చిరంజీవి దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీయింట్రీ ఇచ్చి తీసిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150‘. ఈ సినిమా బుధవారం దేశవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా చిరు అభిమానులు, ఆసక్తి గల వారి కోసం ముందస్తుగా మంగళవారం బెన్ ఫిట్ షోలు వేస్తున్నారు.. తొలిరోజే చూసి తీరాలన్న పట్టుదలతో సినిమా టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది..

బెన్ ఫిట్ షో డబ్బులు చారిటీకి వినియోగిస్తుండడంతో అభిమానులు ఆనందంగా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు.. బెంగళూరులో ఓ థియేటర్ లో మూడు టికెట్లను వేలం వేస్తే రూ.36 లక్షలకు ఓ చిరు అభిమాని దక్కించుకోవడం విశేషం. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా స్పెషల్ షోల టికెట్ ల ధరలు రూ.500-1000 వరకు పలకడం చిరు స్టామినాను రుజువు చేస్తోంది. ఈ బెన్ ఫిట్ షో డబ్బులన్నీ చారిటీ సంస్థకు పోతుండడంతో అటు చిరు కోరిక.. ఇటు అభిమానుల ఆసక్తి నెరవేరినట్లు అవుతోంది..

To Top

Send this to a friend