2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..

గుంటూరు ప్లీనరీతో ఎన్నికల శంఖారావం పూరించిన వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకవేళ కేంద్ర‌ ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనే నిర్ణయంతో ముందుగానే ఎన్నికలు ప్రకటించినా దానికి కూడా సిద్ధమయ్యేలా వ్యూహాలు రచించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఏపీలో ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ పావులు కదుపుతోంది. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావాహుల జాబితాను సిద్ధం చేస్తోంది. చివ‌రి క్ష‌ణంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ అప్పుడు హ‌డావిడి ప‌డ‌కుండా ఇప్ప‌టి నుంచే అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ప‌ష్ట‌త ఉండాల‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌కు జ‌గ‌న్ కి ఓకే చెప్పేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అందులో దాదాపు ఖ‌రార‌యిన వారు కూడా ఉన్నారు. సిట్టింగుల‌లో కొంద‌రు ఊగిస‌లాట‌లో ఉన్న‌ప్ప‌టికీ అనేక‌మందికి మాత్రం సీటు ఖాయం అయ్యింది.

67 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న జ‌గ‌న్ ప్ర‌స్తుతం వారిలో 46 మందిని త‌న‌వెంట నిలుపుకున్నారు. ఇప్పుడున్న వారిలో సుమారు 30 మందికి లైన్ క్లియ‌ర్ అని లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. వారి జాబితా దాదాపుగా ఇలా ఉండ‌వ‌చ్చు..

1. విశ్వ‌రాయి క‌ళావ‌తి – పాల‌కొండ (శ్రీకాకుళం)
1. పాముల పుష్పా శ్రీవాణి – కురుపాం (విజ‌య‌న‌గ‌రం)
3. కే రాజ‌న్న‌దొర – సాలూరు (విజ‌య‌న‌గ‌రం)
4. బి. ముత్యాల నాయుడు – మాడుగ‌ల (విశాఖ‌ప‌ట్నం)
5. దాడిశెట్టి రాజా – తుని (తూగో జిల్లా)
6. చిర్ల జ‌గ్గిరెడ్డి – కొత్త‌పేట (తూగోజిల్లా)
7. కొడాలి నాని – గుడివాడ (కృష్ణా జిల్లా)
8. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి – మంగ‌ళ‌గిరి (గుంటూరు)
9. కోనా ర‌ఘుప‌తి – బాప‌ట్ల (గుంటూరు)
10. ముస్తాఫా – గుంటూరు ఈస్ట్ (గుంటూరు)
11. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి – మాచ‌ర్ల (గుంటూరు)
12. గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి – న‌ర‌సారావు పేట (గుంటూరు)
13. ఆర్ ప్ర‌తాప్ కుమార్ రెడ్డి – కావలి (నెల్లూరు)
14. అనిల్ కుమార్ యాద‌వ్ – నెల్లూరు సిటీ (నెల్లూరు)
15. కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి – నెల్లూరు రూర‌ల్ (నెల్లూరు)
16. కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి -స‌ర్వేప‌ల్లి
17. కోరుముట్ల శ్రీనివాసులు – కోడూరు (క‌డ‌ప‌)
18. గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి – రాయ‌చోటి (క‌డ‌ప‌)
19. రాచ‌మల్లు ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు (క‌డ‌ప‌)
20. వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి – పులివెందుల (క‌డ‌ప‌)
21. ఎక్క‌ల‌దేవి ఐజ‌య్య – నందికొట్కూరు (క‌ర్నూలు)
22. గౌరు చ‌రితా రెడ్డి – పాణ్యం (క‌ర్నూలు)
23 .బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి – డోన్ (క‌ర్నూలు)
24. వై సాయి ప్ర‌సాద్ రెడ్డి – ఆధోని (క‌ర్నూలు)
25. వై విశ్వేశ్వ‌ర్ రెడ్డి – ఉర‌వ‌కొండ (అనంత‌పురం)
26. చింత‌ల రామ‌చంద్రారెడ్డి – పీలేరు (చిత్తూరు)
27. దేశాయి తిప్పారెడ్డి – మ‌ద‌న‌ప‌ల్లి (చిత్తూరు)
28. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – పుంగ‌నూరు (చిత్తూరు)
29. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి – చంద్ర‌గిరి (చిత్తూరు)
30. ఆర్కే రోజా – న‌గ‌రి (చిత్తూరు)

వీరితో పాటు సిట్టింగ్ ల‌లో మ‌రో అర‌డ‌జ‌ను మందికి సీట్లు ఖాయం. అయితే వారికి స్థానభ్రంశం జ‌ర‌గ‌వ‌చ్చు. లేదా ఎంపీ సీటు నుంచి కానీ అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. అలాంటి వారిలో గిడ్డి ఈశ్వ‌రి (పాడేరు), మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి (ఆత్మ‌కూరు) ఆదిమూల‌పు సురేష్ (సంత‌నూత‌ల‌పాడు), డా. సురేష్ (పూత‌ల‌ప‌ట్టు) స‌హా మ‌రికొంద‌రున్నారు. వీరితో పాటుగా వార‌సులకు గానీ,తిరిగి మ‌ళ్లీ వారికే గానీ సీట్లు ద‌క్క‌వ‌చ్చ‌నుకుంటున్న వారిలో మేకా ప్ర‌తాప‌ అప్పారావు (నూజీవీడు), జంకే వెంక‌ట‌రెడ్డి (మార్కాపురం), ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి (క‌మ‌లాపురం) ఉన్నారు. కొత్త‌గా పార్టీలో చేర‌డానికి సంకేతాలు ఇస్తున్న వారిని బ‌ట్టి మ‌రికొన్ని స్థానాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అలాంటి లిస్టులో కంబాల జోగులు (రాజాం), ర‌ఘురామిరెడ్డి (మైదుకూరు), బాల‌నాగిరెడ్డి (మంత్రాల‌యం) వంటి వారున్నారు. ఇక అమ్జాద్ బాషా (క‌డ‌ప), నారాయ‌ణ స్వామి (గంగాధ‌ర నెల్లూరు) వంటి స్థానాల్లో మార్పులు అవ‌స‌రం లేకున్నా చివ‌రి నిమిషంలో ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న అంచ‌నాలున్నాయి. ఇక మిగిలిన వారి ప‌రిస్థితి ఊగిస‌లాట‌గానే చెప్ప‌వ‌చ్చు.

వీరితో పాటు గత ఎన్నికల్లో దాదాపుగా గెలుపు దిశగా పయనించి అత్యల్ప తేడాతో ఓడిపోయిన వారి లిస్టును కూడా పరిశీలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ అభ్యర్థులు ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజలతో ఎంతవరకూ సత్సబంధాలు కలిగిఉన్నరాన్న దానిపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఏదిఏమైనా గెలుపే లక్ష్యంగా వైకాపా దూకుడుగా అడుగులు వేయడం తెదేపా వర్గాల్లో కలవరపాటుకు గురిచేస్తుంది.

To Top

Send this to a friend