2019లో జగన్.. 2020లో చంద్రబాబు జైలుకు..


ఇటీవల అసెంబ్లీ సమావేశ నేపథ్యంలో సమావేశమైన వైసీపీ శాసనసభాపక్షం భేటిలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తాను 2019లో అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడి ని జైలుకు పంపిస్తానని.. వాళ్ల అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని బాంబు పేల్చినట్టు సమాచారం. అందుకోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది..

కాగా ఇదే ప్లాన్ లో చంద్రబాబు కూడా ఉన్నట్టు తెలిసింది.. 2019లో జగన్ బయట ఉంటే తాము ఏపీలో గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలిసింది. అందుకే మోడీని, కేంద్ర సహకారంతో జగన్ కేసులను తేల్చి ఆయన్ను జైలుకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. సేనాని లేని వైసీపీకి ప్రజాభిమానం తగ్గుతుందని ఇలా దెబ్బతీసి లబ్ధి పొందాలని చూస్తున్నట్టు తెలిసింది..

కాగా బీజేపీ ఐడియా మాత్రం వేరేలా ఉన్నట్టు సమాచారం. యూపీ, గోవాలాంటి ఎన్నికల్లో అవినీతి పరులకు సైతం టికెట్లిచ్చి..వారితో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఏపీలో అధికారం కోసం జగన్ ను సైతం వదులుకుంటుదని చెప్పలేం.. ఇటీవలే జగన్ తో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఏపీలో గెలిస్తే బీజేపీలో విలీనం అయితే కేసులన్నీ రద్దు చేస్తామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి జగన్ ఓకే అన్నాడని.. అయితే బీజేపీలో ఇప్పుడే కలిసి పోటీ చేస్తే మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లు పడవని.. అధికారంలోకి వచ్చాక బీజేపీలో చేరుతానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఏపీలో రాజకీయాలు 2019లో రసవత్తరంగా మారడం ఖాయం.. చంద్రబాబు, జగన్ ఎవరూ అధికారంలోకి వచ్చినా ఒకరు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend