2019: పవన్ సీఎం.. బండ్ల గణేష్ మంత్రి


‘‘2019 ఎన్నికల్లో వార్ వనసైడ్ అవుతుంది.. పవన్ ఆ ఎన్నికల్లో తప్పక గెలుస్తాడు.. అందులో నేను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అవుతా..’’ అని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఇటీవల ఓ టాప్ తెలుగు న్యూస్ చానల్ తో మాట్లాడిన బండ్ల గణేష్ పవన్ తనకు దేవుడు అంటూ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘనవిజయం సాధిస్తుందని.. తాను గెలిచి మంత్రినై అధ్యక్ష అంటా అంటూ చమత్కరించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విఫలమైంది కదా అనే ప్రశ్నకు గణేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏదో ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది కదా అని ప్రతిసారీ అలాగే జరుగుతుందా అని బండ్ల ప్రశ్నించాడు. పవన్ గెలిస్తే తనకు రాజకీయాల్లో బంగారం లాంటి భవిష్యత్ ఉంటుందని బండ్ల అశాభావం వ్యక్తం చేశారు.
కాగా పవన్ రాజకీయ ప్రసంగాలను త్రివిక్రమ్ రాసిస్తాడన్న విమర్శకు బండ్ల సమాధానం దాటవేశారు. అసలు పవన్ లో చాలా కళలున్నాయని.. ఆయనకు ఎవరూ ఏం సాయం చేయకున్నా మట్లాడగల సామర్థ్యం ఆయనకుందని స్పష్టం చేశారు.
ఇక బండ్ల గణేష్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బినామా అన్న విమర్శలకు గణేష్ నవ్వి ఊరుకున్నారు. తాను ఆంధ్రబ్యాంకు నుంచి అప్పు తీసుకొని సినిమాలు చేస్తానని.. అలాగే తీసి టెంపర్, ఇద్దరమ్మాయిలతో హిట్ కొట్టానని తెలిపారు. నేను ఎవ్వరికీ బినామీ కాదని తేల్చిచెప్పారు.
బండ్ల గణేష్ చెప్పిన సంచలన రాజకీయ, సామాజిక అంశాలు కింద వీడియో లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend