200 ఏళ్ల కలియుగ దేవుడు అవతరించాడు..

 

మంగోలియా దేశ రాజధాని ఉలాన్ బటార్ కు 100 కి.మీల దూరంలోని ఓ అడవిలో ఉన్న గుహలో అద్భుతం జరిగింది. ఓ బౌద్ధ సన్యాసి పద్మాసనంలో దీక్ష చేస్తుండగా కొందరు దుండగులు గుప్త నిధుల కోసం వెళ్లి చూశారు. ధాన్యముద్రలో ఉన్న ఒక బౌద్ధుడిని చూసి బయటకు తీసుకొచ్చారు. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుందామని ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కారు. అలా కదలకుండా బక్కచిక్కిపోయిన వృద్ధుడిని పలువురు డాక్టర్లు పరీక్షించి చూడగా నమ్మశక్యం కనీ రీతిలో అతడు బతికే ఉన్నాడు. పల్స్ కొట్టుకుంటోందని. ఆయన వయసు 200 ఏళ్లు అని తేల్చారు.

ఇప్పుడా బౌద్ధ భిక్షువు దేవుడని మంగోలియాలో ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మీడియా కూడా బౌద్ధుడి అవతారం అని కథ కథలుగా ప్రచారం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంగోలియాలోని నేషనల్ సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు అతడిని తీసుకొని పోయి పరీక్షలు జరిపింది.మంచుతో కప్పబడి ఉన్న గుహలో చల్లటి వాతావరణం వల్ల అతడు గడ్డకట్టుకుపోయి శరీరం పాడవకుండా పద్మాసనంలో అలాగే ఉండిపోయాడని తేల్చాడు. అతడు నాడి వ్యవస్థ మాత్రం కొట్టుకుంటోదట.. వయసు 200 ఏళ్లు అని తేల్చారు.

ఈ స్థితిలో ఉన్న వారు ఏదో రోజు అద్భుతాన్ని సృష్టిస్తారని.. కలియుగ దేవుడు అవతరించాడని అక్కడి ప్రజలు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా 200 ఏళ్లు ఆకలి దప్పులు, నిద్ర ఏదీ లేకుండా కదలక, మెదలక దేనికీ చలించక ధాన్యంలో మునిగిపోయిన వ్యక్తులను బుద్ధుని అవతారంగా భావిస్తారట.. ఇలా ఇప్పుడు గుహలో దొరికిన 200 ఏళ్ల సజీవ బౌద్ధుడిగాథ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోందట..

To Top

Send this to a friend