మార్కెట్లోకి రూ.200 కొత్తనోటు.. ఎన్నో విశేషాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడానికి కొత్తగా మరో నోటును తీసుకొస్తోంది.. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో తీవ్రమైన డబ్బుల కొరత వేధిస్తోంది. జనం చేతిలో డబ్బులు ఉండడం లేదు. రూ.2వేల నోట్లు విడుదలైన మరుక్షణం.. కొందరు బడాబాబులు, అక్రమార్కులు వెంటనే బ్లాక్ మార్కెట్ కు తరలించి మాయం చేస్తున్నారు. దీంతో ఎన్ని నోట్లు వచ్చినా కూడా మార్కెట్లో నగదు కొరత తీవ్రంగా ఉంది.

పెద్ద నోట్లు రద్దు చేసి మోడీ ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంతే స్థాయిలో విమర్శలు కొనితెచ్చుకున్నాడు. మార్కెట్లో సరిపడా రూ.100, రూ.500 నోట్లు లేక జనంలో చెలామణీ కష్టమవుతోంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో నోటును తీసుకొస్తోంది.. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణాశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. ఈ రూ.200 నోటులో ఎన్నో అత్యాధునిక రక్షణ చర్యలు చేపట్టారు. వివిధ కోణాల్లో తనిఖీ చేసి నకిలీవి సృష్టించడానికి వీలులేని రీతిలో తయారు చేస్తున్నారట.. త్వరలోనే కొత్త రూ.200 నోటు మార్కెట్లోకి రాబోతున్నదన్నమాట..

రూ.100, రూ.500 మధ్య ఎలాంటి మధ్యస్థ నోటు లేకపోవడంతో కొత్తగా వస్తున్న రూ.200 నోటు ఆలోటును భర్తీ చేయబోతోంది. అందుకే ఈసారి కొరత లేకుండా ఒకేసారి దాదాపు 50 కోట్ల కొత్త రూ.200 నోట్లను ఒకేసారి ముద్రించి సెప్టెంబర్ లో మార్కెట్లోకి రిలీజ్ చేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు సమాచారం. కాపీ కొట్టడానికి వీల్లేని అంతర్జాతీయ స్థాయి డిజైన్, ఫీచర్లు, భద్రతా చర్యలను రూ.200 నోటులో కేంద్రం తీసుకుంది. అత్యాధునిక చిప్ వ్యవస్థతో నోట్లను తయారు చేసినట్టు సమాచారం. ఈ 200 నోటుకు నకిలీ తయారు చేయడం కష్టమని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు..

To Top

Send this to a friend