20 ఏళ్ల కిందటి చెవిటి అబ్బాయి కథ..

రాంచరణ్ ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. తొలిసారి క్రియేటివిటీ దర్శకుడు సుకుమార్ చేతిలో రాంచరణ్ పడ్డారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో రాంచరణ్-సుకుమార్ జోడి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎందుకంటే విలక్షణ, వినూత్న కథలతో ముందుకు సాగే సుకుమార్ కు.. పాత్రల్లో ఒదిగిపోయే రాంచరణ్ లు తొలిసారి కాంబినేషన్ గా రాబోతున్నారు. అంతేకాకుండా ఈ కథ 20 ఏళ్ల కిందట ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. అందులో మూగ, చెవిటి అబ్బాయి పాత్రలో చరణ్ నటిస్తున్నారట.. దీంతో టాలీవుడ్ లో అంతటా క్యూరియాసిటీ నెలకొంది. ఇక ప్రధాన పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆది పినిశెట్టి కీరోల్ పోషిస్తున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి.

ప్రతీదీ ఖచ్చితంగా తీసే సుకుమార్ సైతం ఈ కథ కోసం లోకేషన్ల వెంట పడ్డారు. 20 ఏళ్ల కింద గ్రామాలు ఎలా ఉండేవో అలాంటి గ్రామాను వెతికే పనిలో ప్రస్తుతం సుకుమార్ టీం ఉంది. ఇందుకోసం తమిళనాడులోని పొలాచ్చిలో ఓ గ్రామాన్ని ఎంచుకున్నారట.. వచ్చేనెలలో అక్కడ షూటింగ్ ప్రారంభిస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి.

కాగా చరణ్ ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచుతున్నారు. పాత్ర ఔచిత్యాన్ని కచ్చితంగా చూపించాలని భావిస్తున్న చరణ్ ఇందుకోసం భారీ గడ్డం.. గళ్ల లుంగీలు.. పక్కా పల్లెటూరి అవతారం కోసం స్టడీ చేస్తున్నట్టు తెలిసింది..

To Top

Send this to a friend