స్పైడర్‌ మళ్లీ రానున్నాడు!


మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. భారీ అంచనాల నడుమ దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. హాలీవుడ్‌ సినిమాలా ‘స్పైడర్‌’ ఉంటుందని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.

సినిమా క్రేజ్‌ను మరింత పెంచేందుకు మరో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు డైలాగ్‌తో పాటు కొన్ని కీలక షాట్స్‌తో టీజర్‌ను కట్‌ చేస్తున్నారు. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టులో రెండవ టీజర్‌ను విడుదల చేసేందుకు మురుగదాస్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మహేష్‌బాబు ఈ సినిమాలో మునుపటితో పోల్చితే మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడని, ఈ చిత్రంతో మహేష్‌బాబు రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అంటూ ఆయన అభిమానులు నమ్మకంతో చెబుతున్నారు. ఆగస్టులో మహేష్‌ పుట్టిన రోజు టీజర్‌ను విడుదల చేసి, అదే నెల చివర్లో ఆడియోను మరియు ట్రైలర్‌ను ఆవిష్కరించాలని భావిస్తున్నారు.

To Top

Send this to a friend