చిరు రేసులోకి

చిరంజీవి తర్వాతి సినిమా ఏదో తెలిసిపోయింది. 151వ సినిమాగా చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తీస్తున్నారు. ఇది కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మాతగా వస్తోంది. ఈ సినిమా తర్వాత వరుసగా మూడు బ్యానర్లలో నటించేందుకు చిరంజీవి అంగీకరించినట్లు సమాచారం.

అందులో మొదట చిరు తన 152వ సినిమాను బావమరిది గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే బోయపాటి అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ లో తీసిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఆ ఊపులోనే చిరుతో కథను సిద్ధం చేసినట్టు తెలిసింది..

ఇక తర్వాత 153వ సినిమాను అశ్వినీదత్ నిర్మాతగా వైజెయంతీ మూవీస్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు నటించనున్నారు. ఆ తర్వాత తన స్నేహితుడు అయిన జెమినీ కిరణ్ నిర్మాత 154వ సినిమాకు చిరంజీవి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నాడట..

ఇలా గ్యాప్ తర్వాత చిరంజీవి వరుసగా 4 సినిమాలకు కమిట్ అయి కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ సవాల్ విసురుతుండడం విశేషం.

To Top

Send this to a friend