మార్చి 3న వ‌స్తున్న `మెట్రో

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -`మెట్రో`. ర‌జ‌ని రామ్ నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌లవుతోంది. ఇదివ‌ర‌కే స్టార్ డైరెక్ట‌ర్లు ఏ.ఆర్‌.మురుగ‌దాస్‌, గౌత‌మ్‌మీన‌న్ `మోట్రో` సినిమా అద్భుత చిత్ర‌మ‌ని కితాబిచ్చారు. లేటెస్టుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో న‌వ‌త‌రం హీరో శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ-“త‌మిళంలో అద్భుత విజ‌యం సాధించిన చిత్ర‌మిది. తెలుగు ట్రైల‌ర్ చాలా బావుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద‌ విజ‌యం సాధించాలి. తెలుగు నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“హైద‌రాబాద్‌, విశాఖ వంటి మెట్రో న‌గ‌రాల్లో నిరంత‌రం చైన్ స్నాచింగ్ వార్త‌ల గురించి వింటూనే ఉన్నాం. మెట్రో సిట్సిలో స్నాచ‌ర్లు మ‌హిళ‌ల మెడ‌లోంచి గొలుసులు తెంచుకుపోవ‌డం ఒక్కోసారి ప్రాణాంత‌కంగా మారుతున్న ఘ‌ట‌న‌ల్ని వింటున్నాం. య‌థార్థ‌ఘ‌ట‌న‌ల్ని అంతే హృద్యంగా తెర‌పై ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కులు. ఈ చిత్రాన్ని ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జ‌నీ రామ్ నిర్మిస్తున్నారు. మార్చి 3న సినిమా రిలీజ‌వుతోంది. పెద్ద విజ‌యం సాధిస్తామ‌న్న ధీమా ఉంది. ఏ.ఆర్‌.మురుగ‌దాస్‌, గౌత‌మ్‌మీన‌న్ వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. తాజాగా టాలీవుడ్ స్టార్ శ‌ర్వానంద్ స్వ‌యంగా థియేట్రికల్ ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించి ప్ర‌శంసించారు. శ‌ర్వాకి ధ‌న్య‌వాదాలు“ అన్నారు

To Top

Send this to a friend