వివాదంలో వెయ్యి కోట్ల మహాభారతం..!

‘బాహుబలి’ తర్వాత దాన్ని మించిన స్థాయిలో సినిమాలు తీసేందుకు పలువురు ఫిల్మ్‌ మేకర్స్‌ ముందుకు వస్తున్నారు. అన్నింటి కంటే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న ప్రాజెక్ట్‌ వెయ్యి కోట్ల మహాభారతం. మలయాళ రచయిత రచించిన నవల రండమోజమ్‌ ఆధారంగా భీముడి ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుబాయ్‌కి చెందిన ఒక ఇండియన్‌ వ్యాపారి వెయ్యి కోట్లతో ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ భీముడి పాత్రకు ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. ఇక తెలుగు, తమిళం, హిందీ భాషల నుండి కూడా ప్రముఖ నటీనటులను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. ఈ సమయంలోనే ఈ సినిమాను వివాదాలు చుట్టు ముడుతున్నాయి. కేరళకు చెందిన హిందూ సంఘాల వారు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మహాభారతంను మహాభారతంగా తీస్తే తమకేం సమస్య లేదని, అయితే ఒక వ్యక్తి మహాభారతంను వక్రీకరించి రచించిన దాన్ని మహాభారతం పేరుతో సినిమాగా చేస్తే ఊరుకునేది లేదని హిందూ సంఘాల వారు అంటున్నారు. ఒక వేళ ఆ సినిమాను తీస్తే నవల పేరు అయిన రండమోజమ్‌ అని పేరు పెట్టాల్సిందిగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే మహాభారతంను ఉన్నది ఉన్నట్లుగా తీస్తే మహాభారతం అనే టైటిల్‌కు తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వారు అంటున్నారు. మొత్తానికి ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాకుండానే వెయ్యి కోట్ల మహాభారతంకు కొత్త సమస్యలు వస్తున్నాయి.

To Top

Send this to a friend