హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ (హెచ్‌బిడి) టీజర్‌ విడుదల

hbd-movie-still-1
లాగిన్‌ మీడియా పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి). ఈ చిత్రం యొక్క టీజర్‌ని ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత సాయి వెంకట్‌, దర్శకుడు కృష్ణకార్తీక్‌, మేఘన, సంతోషి, సల్మాన్‌, డిఓపి కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌గౌడ్‌ వై, నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణకార్తీక్‌ మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన నేను..ఫస్ట్‌టైమ్‌ డైరెక్షన్‌ చేశాను. ఈ చిత్రం యూత్‌ని డెఫనెట్‌గా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో, చక్కటి సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నన్ను, నా కథని నమ్మి..నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. నా ఈ తొలి ప్రయత్నానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను…అన్నారు.
చిత్ర నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై మాట్లాడుతూ..మేము ఒక టీమ్‌లా ఏర్పడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం. ప్రస్తుతం మా ఈ హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జనవరి 1న ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని, అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అన్నారు.
మేఘన, సంతోషి, సల్మాన్‌, హిమజ, మానస, సురేష్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్‌ యం.యం, డిఓపి: కన్నా కోటి, ఎడిటర్‌: కె.ఆర్‌. స్వామి, డైలాగ్స్‌: అభయ్‌ శ్రీజయ్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ పోలే, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: మల్లిక్‌. కె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై, నిర్మాత: ఉదయ్‌భాస్కర్‌. వై, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణకార్తీక్‌.

To Top

Send this to a friend