హోళీ స్పెషల్: ఎయిర్ టెల్ అదిరిపోయే ఆఫర్


రిలయన్స్ జియోతో ఎదురవుతున్న పోటీ నుంచి తప్పించుకునేందుకు దేశంలోనే అగ్రశేణి టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ ఆపసోపాలు పడుతోంది. చచ్చీ చెడీ పలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను అటువైపు వెళ్లకుండా చేస్తోంది.. ఇప్పటికే 345 రూపాయల రిచార్జ్ తో ప్రిపెయిడ్ కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న ఎయిర్ టెల్ తాజాగా పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త చౌకప్యాక్ ను తీసుకువచ్చింది..

హోళీ కానుకగా ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. రూ.150తో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా ఆఫర్ అందించనున్నట్టు ప్రకటించింది. 28రోజుల వ్యాలీడిటీతో ప్యాక్ ను అందించింది. 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు.. 500ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్ ను ప్రవేశపెట్టింది. జియో ఫ్రీ డేటాకు పోటీగా ఎయిర్ టెల్ ఈ ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం.

To Top

Send this to a friend