హోదా వేడి: తెలుగు హీరోలూ ముందుకొచ్చారు.

ప్రత్యేక హోదా పోరు తీవ్రమవుతోంది..జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ యువత చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు పెరుగుతోంది. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత, కొన్ని యువజన సంఘాలు, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నిరసన తెలపాలని నిర్ణయించారు. దీనికి యువత, హీరోలు, నాయకులు తరలి వచ్చి హోదా ఉద్యమన్ని విజయవంతం చేయాలని కోరారు. దీనికి ఇప్పుడు స్పందన వస్తోంది..

మొదట ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ బహిరంగ మద్దతు తెలిపారు. ఆయన పాల్గొనే అవకాశాలూ లేకపోలేదు. ఇక మంగళవారం మిగతా సినీ హీరోల్లో కూడా కదలిక వచ్చింది.. హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిఖిల్, హీరో, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి హోదాకు మద్దతు తెలిపారు. దీంతో ప్రత్యేక హోదా సెగ పుడుతోంది. అగ్రహీరోలు ఎన్టీఆర్, మహేశ్ తదితరులు కూడా మద్దతిస్తే ఈ పోరు మరింత ఉద్రితమయ్యే పరిస్థితులు ఉంటాయి..

వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో పోలీసులు విద్యార్థుల నిరసనకు అనుమతి ఇవ్వట్లేదు. కానీ విద్యార్థులు, నాయకులు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. డీజీపీ, వైజాగ్ కమిషనర్ హోదా పోరును అణచాలని చూడడం.. విద్యార్థులు అంతే పట్టుదలగా ఉండడంతో వేడి రాజుకుంటోంది..

To Top

Send this to a friend