హోదా కోసం గోదాలోకి రాజమౌళి

రాజమౌళి కూడా స్పందించారు.. ఏపీ యువత తమ హక్కుల సాధనకు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపాడు. ప్రత్యేక హోదా కోసం ఈరోజు విశాఖలో చేస్తున్న యువత ఆందోళనకు మద్దతుగా ట్విట్టర్ లో సందేశం పెట్టాడు. విశాఖ ఆర్కే బీచ్ కి వెళ్తున్న ఆంధ్రా యువతకు, బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ జనసేనకు, మిగతా పార్టీలకు రాజమౌళి ఆల్ ది బెస్ట్ చెప్పాడు..

ప్రత్యేక హోదా కోసం పోరాడాలని.. అయితే హింస జోలికి వెళ్లకుండా శాంతియుతంగా నిరసన తెలపడం ఎప్పూడూ ఆహ్వానించదగిందేనని ట్వీట్ చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని.. స్ఫూర్తిని కాపాడాలని రాజకీయ పార్టీలకు చురకలు అంటించాడు.

కాగా ఎప్పుడు వివాదాలకు పోని రాజమౌళి.. తొలిసారి పాలిటిక్స్ మీద కామెంట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.. హోదాకు మద్దతు ఇచ్చి అధికార పార్టీకి కంటగింపుగా మారిన సరే విద్యార్థుల ఉద్యమానికి మద్దతిచ్చి ఈ జక్కన్న శభాష్ అనిపించుకున్నారు. హోదాకు మద్దతు ఇచ్చిన రాజమౌళికి సోషల్ మీడియాలో జననీరాజనం పలుకుతోంది..

To Top

Send this to a friend