హోదా ఎఫ్టెక్ట్: హీరో సంపూర్ణేష్, తమ్మారెడ్డి అరెస్ట్

ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొనడానికి వైజాగ్ వచ్చిన హీరో సంపూర్ణేష్ బాబును, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలాగే సినీ విమర్శకుడు మహేశ్ కత్తిలను వైజాగ్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ ఉదయం విశాఖ ఎయిర్ పోర్టకు చేరుకున్న వారిని అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవ్వరూ వచ్చిన అరెస్ట్ చేస్తూ, యువకులను అదుపులోకి తీసుకంటూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.

ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు హీరోలు ఇప్పటికే మద్దతు తెలిపారు. హీరోలు సంపూర్ణేష్ బాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు బహిరంగ మద్దతు తెలిపారు. హీరో సంపూ అయితే ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే వైజాగ్ రాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత, హీరో పవన్, మరో హీరో శివాజీ ఈ ఉద్యమంలో పాల్గొనడానికి వస్తారా రారా అన్నది ఆసక్తికరంగా మారింది.. జగన్ సైతం వైజాగ్ బీచ్ లో కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

To Top

Send this to a friend