హోదాపై విద్యార్థుల ఉద్యమాన్ని తొక్కేస్తున్నారు!

మరోసారి అదే దగా.. అదే వంచన.. తొక్కేస్తున్నారు.. నిజాలను నిర్భయంగా తొక్కేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా ఏపీ ప్రజల కళ్లకు గంతలు కడుతోంది.. విద్యార్థుల పోరుబాటను తక్కువ చేసి చూపిస్తోంది..
జల్లికట్టు ఉద్యమం తమిళనాట కొత్త సంచలనాలను సృష్టించింది. అక్కడ యువత, విద్యార్థులు, ప్రజలు రోడ్ల మీదకొచ్చి తమ సంప్రదాయ క్రీడపై నిషేధం పడకుండా పోరాడుతున్నారు. విజయం సాధించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ యువతలో కదలిక వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఏపీ యువత, కొన్ని యువజన సంఘాలు, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇప్పుడు పోరుబాటకు సై అన్నారు.. ఈనెల 26న విశాఖలో యువతరం ప్రత్యేక హోదాపై మౌన ప్రదర్శన, ఉద్యమం చేయాలని నిర్ణయించారు. దీనికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. వివిధ పార్టీలు, సంస్థలు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. 26న అనేక మంది విశాఖలో దీక్ష, ధర్నాకు దిగబోతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి యువత పోస్టులు పెడుతోంది. పార్టీలకు అతీతంగా తరలివచ్చి హోదాపై తేల్చుకోవాలని పిలుపునిస్తోంది..

కాగా ఇంత భారీ ఉద్యమంపై తెలుగు మీడియాలో ఎక్కడా చిన్న వార్త కూడా లేకపోవడం కలవరపరుస్తోంది.. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియా, పత్రికలు ఈ విషయాన్ని తొక్కేయాలని శతథా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఎక్కడా వార్త ప్రచురించడం లేదు. చంద్రబాబు విలేకరుల సమావేశాలు, కేంద్ర, రాష్ట్ర సమకాలీన అంశాలను హైలెట్ చేస్తూ ఏపీ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నాయి. హోదా కోసం పోరాడడం తగదు అన్న చంద్రబాబు మాటలనే జనాలకు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హోదా వేస్ట్, ప్యాకేజీయే బెస్ట్ అన్నదానిపైనే విశ్లేషణలు చేస్తున్నాయి. దీంతో గొప్ప ఉద్యమం , దాని స్ఫూర్తి ప్రజలకు తెలియకుండా పోతోంది.. కానీ యువతరం తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఏపీ పాలకులను, ప్రజలను కదిలించడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మీడియా, పాలకులు తొక్కేసిన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ఏపీకి న్యాయం జరిగేలా ఉద్యమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

To Top

Send this to a friend