హోదాకు మద్దతివ్వని మహేశ్, తెలుగు హీరోలందరూ ద్రోహులే..

రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ తో చెలరేగిపోయారు. ఈసారి ఆయన ట్వీట్లలో నిజాయితీ ఉంది. ఆయన ట్వీట్లలో సంధించిన ప్రశ్నల్లో నిజాయతీ ఉంది.. అవును.. రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగు హీరోలను కడిగి పారేశాడు. పవన్ సినిమాల్లో.. నిజజీవితంలో నిజమౌన హీరో అని కొనియాడారు. పవన్ తన తాహతుకు మించి ప్రభుత్వంతో, పెద్ద శక్తులతో పోరాడుతున్నాడని.. ప్రజలకు న్యాయం జరగాలని హోదా కోసం కృషి చేస్తున్నాడని వర్మ ప్రశంసించారు. కానీ అదే సమయంలో ఏపీ ప్రజలతో స్టార్లు, సూపర్ స్టార్లుగా ఎదిగిన తెలుగు హీరోలు ఏపీ ప్రజల సమస్యలపై స్పందించకపోవడం దారునమని మండిపడ్డారు. వారంతా జాతి ద్రోహులేనని విమర్శించారు.

వర్మ తన ట్వీట్లలో ముఖ్యంగా మహేశ్ బాబును ప్రశ్నించారు. తమిళనాడులో మార్కెట్ పెంచుకోవడానికి జల్లికట్టుకు మద్దతు ప్రకటించిన మహేశ్.. తనను సూపర్ స్టార్ ను చేసిన ఏపీ ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించడని వర్మ మండిపడ్డారు. ఏపీ సమస్యలకంటే తమిళ సమస్యలే మహేశ్ కు ఎక్కువయ్యాయా అని ప్రశ్నించారు. మహేశ్ కు డబ్బింగ్ మార్కెట్ పై ఉన్న ప్రేమ ఏపీసొంత మార్కెట్ పై లేకపోవడం దారునమన్నారు. ఏపీ హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ తో భుజం కలపని మహేశ్ తో పాటు తెలుగు సెలబ్రెటీలందరూ ఏపీ క్రిమినల్ ద్రోహులుగా గా మిగిలిపోతారని వర్మ హెచ్చరించారు.

To Top

Send this to a friend