హైదరాబాద్ కు చావోరేవో..

ఐపీఎల్ సమరం క్లిష్ట దశకు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్ జట్టు, పుణె టీంతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరడం దాదాపు కష్టమే.. వచ్చే మిగతా రెండు మ్యాచ్ ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై తిరుగులేని విజయాలను సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన చివరి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో అనూహ్య పరాజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో 4వ స్థానంలో ఉన్న హైదరాబాద్.. మూడో స్థానంలో ఉన్న పుణెపై గెలిస్తేనే ప్లేఆఫ్ కు వెళుతుంది. లేదంటే సమీకరణాలు సంక్లిష్టంగా మారి గ్రూప్ దశలోనే నిష్క్రమించే అవకాశాలున్నాయి. పంజాబ్, ఢిల్లీలు కూడా రేసులొకొచ్చి విజయాలు సాధిస్తే హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు సంక్లిష్టం అవుతుంది.

శనివారం హైదరాబాద్ సొంతగడ్డ ఉప్పల్ లో పుణె ను ఎదుర్కోబోతోంది. అసలు సోదిలోలేని పుణెను కోట్లు పెట్టి కొన్న స్టోక్స్, ధోని కుర్ర ఆటగాళ్లు రాణించి వరుసగా ఆరు విజయాలను సాధించి పెట్టి ప్లేఆఫ్ లో 3వ స్తానంలోకి చేర్చారు. హైదరాబాద్ మీద కూడా గెలిస్తే పుణె రెండోస్థానంలోకి వెళుతుంది. హైదరాబాద్ ప్రమాదంలో పడుతుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవోగా మారింది.

కాగా సన్ రైజర్స్ కు సొంతగడ్డ హైదరాబాద్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లన్నింటిని గెలిచింది. హైదరాబాద్ లో టోర్నీలోనే బెస్ట్ టీంలు అయిన కోల్ కత, ముంబై లాంటి జట్లను కూడా ఓడించింది. ఇదే ఊపులో పుణెను కూడా ఓడించి ప్లేఆఫ్ లో ముందుకెళ్లాలని వార్నర్ సేన కృతనిశ్చయంతో ఉంది

To Top

Send this to a friend