హైదరాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 8 `షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌`

01 (1)
హైదరాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 8 ఆధ్వర్యంలో షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, రాజ్ కందుకూరి, సుబ్బారావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు లేవు. దాని కారణంగా కార్పొరేటర్‌ స్కూల్స్‌ తో పోటీ పడలేకపోతున్నాయి. ప్రాజెక్ట్‌ 511 ద్వారా ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ ప్రాంతాల్లో 1022 స్కూల్స్‌ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తున్నారుఉ. అలాగే మిగిలిన స్కూల్స్‌ లో సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ నేతృత్వంలో మూడు నుండి పది నిమిషాల వ్యవథిలో షార్ట్‌ ఫిలింస్‌ కాంటెస్ట్‌ ను నిర్వహిస్తున్నారు.
ఈ కాంటెస్ట్‌ కోసం డి.సురేష్‌బాబు, రామ్మోహన్‌ రావు, తరుణ్‌భాస్కర్‌, అవరసరాల శ్రీనివాస్‌లు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. షార్ట్‌ ఫిలింస్‌ను p511shortfilm@gmail.comమెయిల్ కుపంపాలి.
సెప్టెంబర్‌20 వరకు పంపాలి. అక్టోబర్‌ 9న ఈ షార్ట్‌ ఫిలింస్‌ను జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ కాంటెస్ట్‌ కు ఏ ఫీజు లేదు, అలాగే భాషా బేదం లేదు. ఈ కాంటెస్ట్‌ మొదటి ప్రైజు విజేతకు 50వేల రూపాయలు,రెండవ ప్రైజుకు 15వేల రూపాయలు, మూడవ ప్రైజుగా అందిస్తారు.ఈ సందర్భంగా…
డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ – పాఠశాలల్లో కనీస అవసరాల కోసం ప్రాజెక్ట్‌ 511 చేస్తున్న చిన్న ప్రయత్నమిది. దీని ద్వారా పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించవచ్చు. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో ముందుకు వస్తే కెమెరాలను మా స్టూడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం” అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “మంచి నాణ్యమైన విద్య కోసం చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది. మన ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులున్నారు. వారు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొంటే బావుంటుంది“ అన్నారు.
ప్రాజెక్ట్ 511
దేశంలో చదువుకునే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్థాపితమైన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియాలో 600 స్కూల్స్ ను నిర్మించింది. అందులో 40 స్కూల్స్ ను హైదరాబాద్ లో నిర్మించింది. అందులో భాగంగా హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 సంస్థ 2000 సంవత్సరం కంటే ముందు నుండి దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రాథమిక అవసరాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డిలలోని 1022 పాఠశాలల్లోని దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించింది.
To Top

Send this to a friend