హీరో సునీల్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్

jakkanna-movie-posters2

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర పాటలు, ట్రైలర్స్ విడుదలైనప్పటి నుంచే క్రేజ్ భారీగా పెరిగింది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ ఈ చిత్రం సాధించింది. హీరో సునీల్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా జక్కన్న నిలవడం విశేషం. విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాని డిఫరెంట్ స్టోరీ లైన్ తో… ప్రతీ సీన్ ను హిలేరియస్ గా మలిచిన ఈ చిత్రం సునీల్ కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందనే ప్రశంసలు అందుకుంటోందని నిర్మాత అంటున్నారు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… మా జక్కన్నచిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల చేశాం. సినిమాకు ముందునుంచి ఉన్న క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. సునీల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం జక్కన్న. అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మేం అనుకున్నట్టుగా కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ భారీ ఓపెనింగ్స్ రావడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు.
To Top

Send this to a friend