హీరో శ్రీకాంత్ చిత్రం ‘రా.రా…’


ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రమిది.
ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి నరసారావు పేటలో జరిగింది.
శ్రీకాంత్ కథానాయకునిగా ‘రారా’ పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించిన విషయం విదితమే. ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రం లోని ఓ గీతాన్ని నరసారావు పేటలోని శ్రీమిత్ర జూనియర్ కాలేజీ లో విద్యార్థిని,విద్యార్థుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ డి.ఐ.జి. శ్రీ జె.సత్యన్నారాయణ రావు, ప్రముఖ కధా నాయిక కేథరిన్ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు కళాశాలలో ఉన్నత ర్యాంక్ సాధించిన విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా ‘రా.రా…’ ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రం లోని ఓ గీతం విడుదల అయింది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’ ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం.
మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను.చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
‘రారా’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాప్రోక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్,
సమర్పణ: శ్రీమిత్ర చౌదరి
నిర్మాత: విజయ్
దర్శకత్వం: విజి చరిష్ యూనిట్

To Top

Send this to a friend