హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన ‘డా.చ‌క్ర‌వ‌ర్తి’ ఆడియో

01 (2)

రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ ప్ర‌ధాన తారాగ‌ణంగా శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బ్యాన‌ర్‌పై శేఖర్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌), ర‌త్న‌మాల రెడ్డి, శేఖ‌ర్ సూరి నిర్మించిన చిత్రం ‘డా.చ‌క్ర‌వ‌ర్తి’.  విజ‌య్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో శ్రీకాంత్ ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించి తొలి సీడీని క‌ల్వ‌కుంట్ల తేజేశ్వ‌ర్‌రావుకు అందించారు. ఈ సంద‌ర్భంగా….
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…శేఖ‌ర్ మంచి టెక్నిషియ‌న్‌. త‌న సినిమాలు మంచి కాన్సెప్ట్‌తో టెక్నిక‌ల్‌గా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా కూడా ఓ డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను..అన్నారు.
క‌ల్వ‌కుంట్ల తేజేశ్వ‌ర్‌రావు మాట్లాడుతూ..శేఖ‌ర్ సూరి మంచి టాలెంటెడ్ ప‌ర్స‌న్ అని తెలుసు. తన సినిమాల‌ను నేను మొద‌టి నుండి ఫాలో అవుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ సాధించి యూనిట్‌కు మంచి పేరును తీసుకు రావాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు.
నిర్మాత ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంప్‌) మాట్లాడుతూ..శేఖ‌ర్‌గారితో జ‌ర్నీ చాలా మంచి అనుభూతినిచ్చింది. ఆయ‌న చెప్పిన క‌మిట్‌మెంట్‌తో అనుకున్న బ‌డ్జెట్‌లోనే సినిమాను ఆరు నెలల్లోనే పూర్తి చేశాం. విజ‌య్ కురాకులగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఆడియో రోజునే శేఖ‌ర్ గారి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా చేయబోతున్నామని తెలుపుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆ సినిమాయే ల‌య‌న్ స‌ఫారీ. డా.చ‌క్ర‌వ‌ర్తి ఆగ‌స్టులో విడుద‌ల‌వుతుంది. అదే నెల‌లో ల‌య‌న్ స‌ఫారీ ప్రారంభం అవుతుంది..అన్నారు.
ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి మాట్లాడుతూ..నిర్మాత చాంప్‌గారికి థాంక్స్‌. ఆయ‌నతో చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. ఓ ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న కార‌ణంగానే..నేను ద‌ర్శ‌కుడిని అయ్యాను. ఆయ‌నే న‌న్ను త‌రుణ్‌కు ప‌రిచ‌యం చేశారు. చాంప్‌ గారు ఓ స్టూడియో స్టార్ట్ చేసిన త‌ర్వాత నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ సినిమా చేసి పెట్టాల‌ని కోరారు. అప్పుడు నేను ఈ డా.చ‌క్ర‌వ‌ర్తి సినిమా చేశాను. మ‌ల‌యాళంలో ఎనిమిది అవార్డులు గెలుచుకున్న లీనాగారు ఇందులో ఓ రోల్ చేశారు. అలాగే సోనియామాన్‌, పూజ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. రిషితో నా మూడో సినిమా. త‌ను చాలా క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల న‌టుడు. అలాగే అశోక్‌కుమార్‌గారి అబ్బాయి వంశీ ఇందులో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ ఇద్ద‌రూ నా నెక్ట్స్ మూవీ ల‌య‌న్ స‌ఫారీలో హీరోలుగా న‌టిస్తారు. అలాగే గిరీష్ స‌హ‌దేవ్‌, అనిరుధ్ సింగ్ ఇలా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. విజ‌య్ కురాకులగారు ఈ సినిమా కోసం ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాను తెలుగులో విడుద‌ల చేసిన త‌ర్వాత త‌మిళం, హిందీలో కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం… అన్నారు.
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ ..శేఖ‌ర్ సూరి చాలా డిప‌రెంట్ సినిమాల‌నే చేస్తాడు. త‌న సినిమాల్లో డిఫ‌రెంట్ కెమెరా వ‌ర్క్‌, సౌండింగ్ మ‌న‌కు విన‌ప‌డుతుంది. ఈ ‘డా.చ‌క్ర‌వ‌ర్తి’ సినిమా శేఖ‌ర్ సూరికి తిరుగులేని బ్రేక్ తెచ్చే చిత్రం కావాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు.
ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ..ట్రైల‌ర్ చూస్తుంటే మంచి థ్రిల్ల‌ర్ చిత్రంలా క‌నిపిస్తుంది. సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు.
మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ..శేఖ‌ర్ నాకు క‌జిన్ అవుతాడు. త‌న సినిమాలు డిప‌రెంట్‌గానే కాదు, ఎగ్జ‌యిటింగ్‌గా కూడా ఉంటాయి. అంద‌రూ చేయ‌డానికి భ‌య‌ప‌డే జోన‌ర్స్‌లో సినిమాలు చేస్తుంటాడు. సినిమాటోగ్రాఫ‌ర్ నుండి మంచి అవుట్‌పుట్ రాబట్టుకోగ‌ల ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ ఒక‌డ‌ని సెంథిల్ వంటి సినిమాటోగ్రాఫ‌ర్ మెచ్చుకున్నాడు. మ్యూజిక్ చాలా బావుంది. శేఖ‌ర్ సూరి అన్నీ సినిమాల్లాగానే ఈ సినిమా కూడా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను.. అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, లీనా, పూజ‌, సోనియామాన్‌, విజయ్ క‌రాకుల‌, అశోక్‌కుమార్‌, వంశీ, గిరీష్‌, అనిరుధ్ సింగ్‌, విజ‌య్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ , అశోక్‌కుమార్‌, పోకిరి విజ‌య్‌, చైత‌న్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః విజ‌య్‌కురాకుల‌, కెమెరా: రాజేంద్ర‌, ఎడిటింగ్: తిరుప‌తి రెడ్డి, ఫైట్స్: స‌తీష్‌, మాట‌లు: చిట్టి శ‌ర్మ‌, నిర్మాత‌లు: ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌), ర‌త్న‌మాల‌రెడ్డి, శేఖ‌ర్ సూరి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ సూరి.

To Top

Send this to a friend