హాలీవుడ్ ను మించి..

బాహుబలి.. ఇక తెలుగు సినిమా స్ట్రాండర్డ్ కాదు.. పక్కా హాలీవుడ్ స్థాయి సినిమా.. అందుకే రాజమౌళి ఇలా ప్లాన్ చేశాడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తన బాహుబలి2 ట్రైలర్ విషయంలో కూడా అంతే పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు.

బాహుబలి2 ట్రైలర్ గురువారం విడుదల కానుంది. దీన్ని తెలంగాణ, ఏపీల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే అన్ని తెలుగు, దక్షిణాది, హిందీ సినిమాలలాగా ఈ సినిమా ట్రైలర్ నిమిషం, ఒకటిన్నర నిమిషం మాత్రమే లేదు. హాలీవుడ్ సినిమాల తరహాలో రెండునిమిషాల 20 సెకెన్ల పాటు ఉండేలా రాజమౌళి తీర్చిదిద్దారు.

ఇప్పుడు బాహుబలి ప్రపంచ స్థాయి సినిమా. అది తెలుగు నుంచి వస్తుంది. అందుకే ఇక్కడ సాదాసీదాగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్న ట్రైలర్ ను ముంబైలో సాయంత్రం గ్రాండ్ గా ఓ వేదికపై రిలీజ్ చేస్తున్నారు. సాయంత్రమే యూట్యూబ్ లోనూ విడుదల చేస్తారు. హిందీ ట్రైలర్ లాంచ్ తో పాటు తెలుగు ట్రైలర్ ను మీడియాకు ఇవ్వనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ట్రైలర్ లు గురువారం సాయంత్రమే విడులవుతున్నాయి. హిందీ ప్రేక్షకులు అక్కడి మార్కెట్ పెద్దది కావడంతోనే రాజమౌళి ముంబైలో ఘనంగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.. కాగా గురువారం విడుదలయ్యే బాహుబలి ట్రైలర్ కు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

To Top

Send this to a friend