హారర్ ఎంటర్ టైనర్ “శివగామి” ట్రైలర్ విడుదల !!

తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందున్న ఓ హారర్ ఎంటర్ టైనర్..  తెలుగులో “శివగామి” పేరుతో, కన్నడలో “నాని” పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది  ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పతాకంపై “శివగామి” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, జై జగదీశ్, కల్పన, రాధ ముఖ్య పాత్రధారులైన ఈ చిత్రంలో..  సీనియర్ హీరోయిన్ సుహాసినీమణిరత్నం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.
ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ లాబ్ లో జరిగింది. శాసన సభ్యులు, మరియు తెలంగాణా సాంస్కృతిక సారధి రసమయి బాలకృష్ణ ముందుగా “శివగామి” చిత్రం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ప్రముఖ రాజకీయవేత్త, గుంటూరు మాజీ శాసనసభ్యులు వెంకట్రావు దియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. సాంగ్ టీజర్స్ ను ప్రముఖ నటి కవిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ నాగులపల్లి పద్మిని,  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, రామకృష్ణ గౌడ్, అల్లాణి  శ్రీధర్ రిలీజ్ చేసారు.  అనంతరం వారు మాట్లాడుతూ..  ట్రైలర్, మరియు సాంగ్ టీజర్స్ చాలా బాగున్నాయని..  సినిమా కచ్చితంగా మంచి  మంచి విజయం సాధిస్తుందని ఆకాక్షించారు. నిర్మాత రామసత్యనారాయణ మరో మంచి విజయం సొంతమవడం ఖాయన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. తెలుగులో ప్రముఖ గాయని గీతామాధురి, ఫేమస్ సింగర్ “గజల్” శ్రీనివాస్ కుమార్తె సంస్కృతీ “శివగామి”లో పాడడం విశేషం. ఈనెల 24న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  హారర్ సినిమాల్లో “శివగామి” సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకముంది” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు రమేష్ కుమార్ జైన్, చిత్ర దర్శకులు సుమంత్  మాట్లాడుతూ..  “శివగామి” తో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. గుజరాత్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు రాసిన భారతిబాబు, ఈ చిత్రంలో ఓ పాత పాడిన కుమారి సంస్కృతి కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్, సంగీతం: త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. శివ వై. ప్రసాద్, సమర్పణ: రమేష్ కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుమంత్.
To Top

Send this to a friend