హవ్వా.. ‘సాక్షి’ జగన్ ది కాదట!

కేసులు, కోర్టులు , బెయిల్ రద్దు తన దాకా వచ్చేసరికి జగన్ తప్పించుకోవడానికి పీచేముడ్ అన్నారు.. సుప్రీంకోర్టు సాక్షిగా సాక్షి చానల్ తనది కాదని స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న జగతి పబ్లికేషన్స్ లో భాగమైన సాక్షి పత్రిక మాత్రమే తనది అని సాక్షి టీవీ.. ఇందిరా టెలివిజన్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. దానికి డైరెక్టర్లు వేరే ఉన్నారని జగన్ సుప్రీంలో వేసిన పిటీషన్ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమకాంత్ రెడ్డి ఇటీవల సాక్షి చానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడారు. జగన్ పై మోపిన కేసులేవీ నిరూపితం కావని.. ఆయన స్వచ్ఛంగా బయటకు వస్తారని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో సాక్షిలో ప్రసారం కావడంతో దీన్ని సుమోటాగా తీసుకొని జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీనికి సమాధానంగా జగన్ తన పీటీషన్ లో అస్సలు సాక్షి చానల్ తనది కాదని.. మాజీ సీఎస్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సాక్షి చానల్ ఉద్యోగి కాదని.. ఆయన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అని జగన్ తన కౌంటర్లో పేర్కొన్నారు.

తానెప్పుడు మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డిని కలవలేదని.. కేసు విచారణను ప్రభావితం చేయడం లేదని.. యాంత్రిక పద్ధతిలోనే బెయిల్ రద్దు సాధ్యం కాదని జగన్ పీటీషన్ లో పేర్కొన్నారు.. సాక్షి టీవీలో ప్రసారమయ్యే కథనాలపై ఎడిటోరియల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కాగా జగన్ వ్యూహాత్మకంగా సాక్షి చానల్ తనది కాదని తేల్చేశారు. కేవలం జగతి పబ్లికేషన్ సాక్షి పత్రిక మాత్రమే తనదని చెప్పారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో కానీ కొంతమందిని డైరెక్టర్లు సాక్షి చానల్ లో పెట్టి నడిపిస్తున్నారు. తెరవెనుక ఉంది జగనే అని అందరికీ తెలిసినా అధికారికంగా.. పేపర్లలో మాత్రం జగన్ ఎండీగా లేరు. ఇందులో ఇటీవలే హెచ్ఎంటీవీ నుంచి కే.రామచంద్రమూర్తి కూడా సాక్షి చానల్ లో డైరెక్టర్ గా ఉన్నారు. మరికొంత మంది రెడ్లు ఉన్నారు. బహుశా జగన్ చానల్ లో కొంత మొత్తాన్ని అమ్మేశాడో లేదా ఎవరికైనా అప్పగించారో లేదో ఇప్పటికైతే స్పష్టత లేదు.

To Top

Send this to a friend