స్వాగతసత్కారం.. ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు..


కేసీఆర్ పాలన చూసి ఇన్ స్పైర్ అయ్యారో.. ఏమో తెలియదు కానీ రాష్ట్ర విభజనకు కారణమైన తెలంగాణ సీఎంకు ఏపీలో ఆదరణ పుష్కలంగా ఉంది. కేసీఆర్ తిరుపతి శ్రీవారి పర్యటనలో నేపథ్యంలో తిరుపతిలో ఆయన మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. రేణిగుంట విమానాశ్రాయానికి కేసీఆర్ మంగళవారం రానున్నారు. రేణిగుంట నుంచి తిరుపతి వెళ్లే మార్గంతో పాటు తిరుపతిలో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ రోడ్డుపక్కన భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.
మంగళవారం రాత్రికి తిరుమలకు చేరుకునే కేసీఆర్ అక్కడ బస చేసి బుధవారం ఉదయం శ్రీవారిని కుటుంబంతో దర్శించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున 5కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పిస్తారు. అదేరోజున తిరుపతిలో జరిగే తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరవుతారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, కుటుంబ సభ్యులు, హరీష్ రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, ఐకేరెడ్డి తదితరులు పాల్గొంటారు.

To Top

Send this to a friend