స్వచ్ఛమైన ‘ అమరం అఖిలం ప్రేమ’

స్వచ్ఛమైన ప్రేమకథగా అమరం అఖిలం ప్రేమ
వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై ఓ సరికొత్త ప్రేమకథా చిత్రం రూపొందుతుంది. వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జోనాథన్ ఎడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరం అఖిలం ప్రేమ అనే టైటిల్‌ని నిర్ణయించారు. కాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ చక్కటి కథ, కథనాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇంటిల్లిపాదికి నచ్చే అన్ని అంశాలున్నాయి. ఇదొక అబ్బాయి కథ- ఒక అమ్మాయి కథ- ఒక నాన్న కథ అందర్ని కలిపే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన షెడ్యూల్‌ను కాకినాడలో పూర్తిచేస్తాం. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ కుటుంబ బంధాలకు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రమిది. గులాబీ, గీతాంజలి, సఖి తరహాలో ఫీల్‌గుడ్‌మూవీగా నిలుస్తుంది.సీనియర్ నరేష్, అన్నపూర్ణమ్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:రసూల్ ఎల్లోర్, ఆర్ట్:రామకృష్ణ, సంగీతం:రథన్ (అందాల రాక్షసి ఫేం ) సంభాషణలు: విస్సా శ్రీకాంత్‌నాయుడు, కూర్పు: అమర్ రెడ్డి, నిర్మాత: వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్, దర్శకత్వం:జొనాథన్ ఎడ్

To Top

Send this to a friend