సోషల్ మీడియాలో చిరు, బాలయ్య ఫైట్.. తెగ ఎంజాయ్..

khaidino150-gpsk-apnewsonline

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయి.. సంక్రాంతి బరిలో పందెంకోళ్ల వలే చిరంజీవి, బాలయ్యలు పోటీలో నిలబడ్డారు. వారి అభిమానులు ఊరుకుంటారా.. తమ అభిమాన నటుడిని కీర్తిస్తూ ప్రత్యర్థిని చిత్తుచేసే కామెడీ పంఛ్ లు, స్ఫూఫ్ లతో తెగ సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఎక్కడ చూసినా అదే చర్చ.. ఏదీ మంచి సినిమా.. ఏదీ చెడ్డ సినిమా.. మనం ఏదీ చూడాలి.. చరిత్ర, హీరో కథ ఇలా అన్నింటిపైనా సెటైర్లు.. ఒకటే విశ్లేషణలు..

బాలక్రిష్ణ అభిమానులైతే.. చిరు సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదో తమిళ సినిమా కథ అని.. రాజకీయాల్లో రైతులను ఆదుకోని చిరు.. సినిమా తీసి ఏం ఆదుకుంటాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అచ్చ తెలుగు వీరుడి కథనే చూడాలని సోషల్ మీడియాలో మోసేస్తున్నారు..

ఇక చిరు 150 వ సినిమాలో మళ్లీ బాస్ ఈజ్ బ్యాక్ వస్తున్నారని.. దాని ముందు సింహాలు, పులులు, రాజులు ఎవరైనా దిగదుడుపేనని చిరు అభిమానులు సెటైర్ వేస్తున్నారు. ఈ ఇద్దరి గొడవతో సోషల్ మీడియాలో ఫైట్ తెగ నడుస్తోంది..

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న చిత్రాలపై హైప్ నెలకొంది. సంక్రాంతికి ఇంత పెద్ద పోటీని ఎవ్వరూ చూసి ఉండరు.. అటు అల్లు అరవింద్ సపోర్ట్ తో చిరంజీవి తెలంగాణ, ఆంధ్రాలోని ప్రముఖ థియేటర్లను చిరు ఖైదీనంబర్ 150 కోసం రిజర్వ్ చేయించారు. ఇక శాతకర్ణి టీం కూడా ఏపీలో, తెలంగాణలో ఎక్కువ థియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేస్తోంది..

To Top

Send this to a friend