సై.. పంతం నీదా..? నాదా.?


కోదండరాం-కేసీఆర్ మధ్య వైరం ముదిరిపాకాన పడింది.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. 22న నిర్వహించే ఈ ర్యాలీకి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. హైదరాబాద్ శివారులో ర్యాలీ నిర్వహించాలని పోలీసులు కోదండరాంను కోరారు. దీంతో కోదండరాం ర్యాలీకి అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు. ఈరోజు కోర్టు అనుమతిపై ఏదో ఒకటి తేల్చనుంది.

కాగా 2009-13 వరకు కేసీఆర్-కోదండలు కలిసి తెలంగాణ కోసం కొట్లాడారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్-జేఏసీ బద్ధశత్రువులుగా మారారు. కోదండపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థులను కోదండరాం రెచ్చగొడుతున్నారని.. విద్యార్థులు ఆయన వెంట వెళితే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని.. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే కోదండ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఎత్తిచూపినందుకే తనను విమర్శిస్తున్నారని.. ప్రభుత్వ అసమర్థతపై తప్పకుండా పోరుబాటు పడతానని స్పష్టం చేశారు. కాగా నిరుద్యోగ ర్యాలీకి సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం లభించింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కూడా తోడ్పాటు నందిస్తుండడంతో పెద్దఎత్తున విద్యార్థులు ర్యాలీకి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యి కట్టడికి చర్యలు తీసుకుంటోంది.

To Top

Send this to a friend