సైనికుడి కష్టాలు చూశాకైనా.. కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుందా?

మనమందరూ ఇప్పుడు కంటినిండా నిద్రపోతున్నామంటే.. అది దేశసరిహద్దుల్లో మన సైనికులు కాపలా కాయబట్టే.. మన కోసం దేశప్రజల కోసం వారు రేయినక పగలనక నిద్రాహారాలు మాని రక్షణగా నిలబడ్డారు.. కేంద్రం కూడా దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తోంది.. కోట్లు ఖర్చుచేస్తోంది. మరి అన్ని కోట్ల రూపాయలతో సైనికులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారంటే అదీ లేదు.. సైనికులు దేశ సరిహద్దుల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. తినడానికి సరైన తిండి లేదు.. కేంద్రం నిధులన్నీ పై అధికారులే మింగేస్తున్నారట.. పసుపు కలిపిన నీళ్ల చారు.. రెండు చిన్న రొట్టే ముక్కలు.. పలుచని కూర కలిపి వడ్డిస్తున్నారని.. ఓ సైనికుడి తన బాధను వెళ్లగక్కాడు..

జమ్మూ కాశ్మీర్ లోని బీఎస్ఎఫ్ 29 వ బెటాలియన్ కి చెందిన జేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ లా మారింది.. దేశంలో అవినీతి ఎక్కువైందని.. అది సైనికులకు కూడా పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులకు బార్డర్ లో కనీసం సరైన ఆహారం కూడా అందలేదని తిండి లేక డ్యూటీకూడా సరిగ్గా చేయలేకపోతున్నామని వాపోయాడు. నీళ్ల చారు, పసుపు నీళ్లు తాగి జీవిస్తున్నామని ఆ వీడియో సాక్ష్యాలతో సహా నిరూపించారు.. తాను ఈ వీడియో తీసినందకు తనను ఉన్నతాదికారులు సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్లరేదని.. కానీ సైనికుల దుర్భర జీవితాన్ని అందరికీ తెలియజేయడానికే ఈ వీడియో తీశానని జవాన్ తెలిపారు.

కాగా ఈ జవాన్ ఉదంతంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ స్పందించారు. ఈ వ్యవహారంపై లోతైనా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. సైనికుడిపై చర్యలేమీ తీసుకోమని మీడియాకు హామీ ఇచ్చారు.

సైనికుడి కష్టాలు కళ్లకు కట్టే వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend