సెన్సార్ కార్యక్రమాల్లో ” వెక్కిరింత”.

ekkirintha-movie-pm-016
శ్రీ లాస్య క్రియేష‌న్స్ ప‌తాకంపై, రాహుల్ శ్వేత స‌మ‌ర్ప‌ణ‌లో  కాక‌ర్ల నాగ‌మ‌ణి నిర్మిస్తోన్న చిత్రం `వెక్కిరింత‌`. కాక‌ర్ల శ్రీధ‌ర్, వినీత్, ప్రేయ‌సి నయ‌క్, మౌనికా రెడ్డి, మ‌హిమ  హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను  సినీ ప్ర‌ముఖులు సీన‌య‌ర్ న‌టి క‌విత‌, వి.సాగ‌ర్, సాయి వెంక‌ట్ త‌దిత‌రులు మంగ‌ళారం సాయంత్రం హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో వీక్షించారు. అలాగే  అన్ని ప‌నులు పూర్తిచేసి జ‌న‌వ‌రిలో  ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “ చ‌క్కిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. హాస్యం, ల‌వ్, అన్ని అంశాలున్న క‌మ‌ర్శియ‌ల్ సినిమా. న‌టీన‌టులంతా బాగా న‌టించారు. ద‌ర్శ‌కుడు అనుకున్న‌ది అనుకున్న విధంగా తెర‌కెక్కించారు.  సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి  జ‌న‌వ‌రిలో రిలీజ్ చేస్తాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆదరిస్తార‌ని ఆశిస్తున్నాం` అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “  మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. అంతా కొత్ త‌వాళ్లైనా బాగా న‌టించారు. నిర్మాత మా లాంటి కొత్త వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ సినిమా చేశారు. అందుకు ఆయ‌న‌కి ఎప్ప‌టికీ రుణ ప‌డి ఉంటాను. ఆయ‌న మామీద పెట్టిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాం` అని అన్నారు.
సీనియ‌ర్ న‌టి క‌విత మాట్లాడుతూ “ ఇప్పుడు ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయి. క‌థ బాగుంటే ఎలాంటి సినిమానైనా బాగా ఆద‌రిస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించి టీమ్ అంద‌రికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లిద్ద‌రు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు వి.సాగార్ మాట్లాడుతూ “ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు న‌చ్చే సినిమా ఇది. కొత్త వాళ్లైనా బాగా న‌టించారు. సినిమా విజ‌యం సాధించి నిర్మాత‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టాలి` అని అన్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో జూనియ‌ర్ రేలంగి, సై సూర్య‌, స్వాతి నాయుడు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
To Top

Send this to a friend