సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న `అల్లుడు సింగం`

img_7788
షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నహీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం `అల్లుడు సింగం`. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ ` తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతో్న్న‌ “అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని విధంగా లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డనుంది. ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో  సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌న‌మాలి రాశారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌జేశారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్‌, మాట‌లుః వెంక‌ట్‌, నిర్మాతః రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడుః రాజ‌శేఖ‌ర్‌
To Top

Send this to a friend