సృజనాత్మకత –‘దువ్వాడ’-ఓ బన్నీ

తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని తెలుగు హీరో అల్లు అర్జున్.. ఆయన ఏదీ చేసినా సంచలనమే.. ఆదినుంచి బన్నీ వేసిన ప్రతి అడుగు విజయంవైపే.. కథల ఎంపికలోనూ.. ప్రతి సినిమాలోనూ తన గెటప్ ను చేంజ్ చేస్తూ అల్లు అర్జున్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాడు. రోటీన్ మూసధోరణిలకు దూరంగా విభిన్నమైన కథలను, దూకుడైన పాత్రలను ఎంపిక చేసుకొని ఇంట్లో ఒకడిలా కలిసిపోతాడు.. తెరపై అల్లు అర్జున్ అనే హీరో కనపడడు.. మన పక్కింటి అబ్బాయే తెరపై ఉన్నాడేమో అనేలా తన ఆహార్యాన్ని ,నటనను, డాన్యులను చూపిస్తాడు. అందుకే బన్నీ సినిమా వస్తుందంటే మన తెలుగులోనే కాదు.. మలయాళం కూడా ఆసక్తి చూపుతారు. బన్నీ సినిమాలకు మలయాళంలో పిచ్ఛ ఫాలోయింగ్ ఉంది..
అందుకే బన్నీ కొత్త చిత్రం వస్తుందంటే.. అంతెందుకు బన్నీ కొత్త చిత్రం చేస్తున్నాడంటే అది మినిమం గ్యారెంటీ సినిమా.. అస్సలు బన్నీ కెరీర్లోనే ప్లాపులు లేవు. అందుకే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అల్లు అర్జున్ సినిమా అంటే ఖచ్చితంగా కొంటారు.
ఇప్పడు దిల్ రాజు నిర్మాణంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీసినిమా చేస్తున్నాడు. దాదాపు పూర్తికావచ్చిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం పేరు దువ్వాడ జగన్నాథమ్.. సినిమా పేరు వింటే ఏదో మాస్ మసాలా అనిపిస్తుందా.. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ లు, నిన్న విడుదలైన టీజర్ చూశాక.. అసలు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఇందులో బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నారు. స్కూటర్ మీద వస్తున్న సీన్ అదిరిపోయింది.. అందులో ఆధ్యాత్మిక భావాలు గల సీన్లు దర్శనమిచ్చాయి. మెడలో రుద్రాక్ష మాల, శివుడి ఆన.. ఓం ఆకారం.. ఇలా బన్నీ ఆహార్యం వింతగా ఉంది .

ఇక హీరో పూజా హెగ్డె అందాలను ఆరబోసింది. మొత్తం ఫుల్ రొమాంటిక్ గా బన్నీకి ముద్దులు పెట్టి.. కురుచదుస్తుల్లో బన్నీని రెచ్చగొట్టే పాత్రలో నటిస్తున్నట్టు కనిపించింది. ఓ వైపు అయ్యగారు బన్నీ అమాయకత్వపు మాటలు.. మరోవైపు పూజా రోమాంటిక్ వేశాలు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆద్యంతం నవ్వులు, కాస్త ఎమోషన్ కలగలపిన ఈ సినిమా టీజర్ ను చూశాక బన్నీ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.

దువ్వాడ జగన్నాథ్ మూవీ ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend