సురేష్ బాబు -అల్లు అరవింద్ లపై ఆరోపణలు చేస్తున్న ఆర్ .కే  గౌడ్ 

 DSC_0021
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ చైర్మన్ గా నా పదవీకాలం మరో ఏడాది ఉన్నప్పటికీ అగ్ర నిర్మాతలకు పంటి కింద రాయిలా ఉన్నానని భావించి నన్ను అకారణంగా తొలగించారని అది ముమ్మాటికీ చెల్లదని అగ్ర నిర్మాతలు సురేష్ బాబు ,అల్లు అరవింద్ లపై సంచలన ఆరోపణలు చేసాడు దర్శక నిర్మాత ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ . ఈరోజు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ”నేను ఏడు నెలలుగా క్యూబ్ ,యు ఎఫ్ ఓ ,పి ఎక్స్ డి కి వ్యతిరేకంగా చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం పోరాడుతున్నానని దానిపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుందామని చాలా రోజులుగా చెబుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఆచరణలో పెట్టడం లేదని నేను ఎప్పటి కప్పుడు పట్టుబడుతుండటంతో ఎలాగైనా సరే నా అడ్డు తొలగించు కోవాలని భావించి ఇలా అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడ్డారని ,క్యూబ్ ,యుఎఫ్ ఓ ,పిఎక్స్ డి లకు ఇతర రాష్ట్రాలలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉందని కానీ ఇక్కడ మాత్రం పదకొండు వేల రూపాయలు అది కూడా కేవళంవారం రోజులకే వసూల్ చేస్తున్నారని దీనిద్వారా చిన్ననిర్మాతలు చాలా నష్ట పోతున్నారని నన్ను రెచ్చగొడితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి గా నాపోరాటం మరింత తీవ్ర తరం చేస్తానని  ,  క్యూబ్ లో అల్లు అరవింద్ పార్ట్ నర్ కాగా యుఎఫ్ ఓ లో సురేష్ బాబు భాగస్వామి అని విరుచుకు పడ్డారు ప్రతాని . నిన్న జరిగిన ప్రొడ్యూసర్ సెక్టార్ ఎన్నికలు చెల్లవని కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపించామని,విజయేందర్ రెడ్డి కినాకు థియేటర్ ల విషయంలో పలుమార్లు గొడవ జరిగిందని అందుకే వాడ్ని  ముందు పెట్టి ఈ తతంగం నడిపించారని  ఆరోపణలు గుప్పించారు . ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ ,సాయి వెంకట్ ,శ్రీరంగం సతీష్ , జీ వి చౌదరి తదితరులు పాల్గొన్నారు .
To Top

Send this to a friend