సుప్రీం తీర్పు: శశికళకు నాలుగేళ్ల జైలు..

ఖేల్ ఖతమైంది. శశికళ ఆశలు ఆవిరయ్యాయి.. తమిళనాడు సీఎంగా అవుదామని కలలు కన్న శశికళకు ఆశానిపాతమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు.. 10 కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు జస్టిస్ పినాకి చంద్రఘోష్ , జస్టిస్ అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఇరవరిసి, దినకరన్ కూడా సుప్రీం దోషులుగా నిర్దారించింది. అంతేకాదు.. పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా సుప్రీం కోర్టు శశికళపై వేటు వేసింది. దీంతో శశికళ తమిళనాడు సీఎం అయ్యే అవకాశాలు మూసుకుపోయినట్టే..  దీంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి.. ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

శశికళకు జైలు శిక్ష ఖరారు కావడంతో ప్రత్యర్థి పన్నీర్ సెల్వం వర్గం ఆయన ఇంటి వద్ద టాపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. శశికళతోపాటు ఆమె కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా జైలు శిక్ష పడడంతో ఇక పన్నీర్ సెల్వం ఆమె చేతిలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కునే పనిలో బిజీగా ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ నిరాశలో మునిగిపోయారు. తదుపరి పరిణామాలపై వారంతా ఆందోళనగా ఉన్నారు. శశికళ జైలు పాలుకావడంతో పన్నీర్ సెల్వంకు సీఎంగా అవకాశాలు మెరుగయ్యాయి.

To Top

Send this to a friend