సుప్రీం కోర్టు నిర్ణయం క్రికెట్ కు మేలు.. పార్టీలకు చేదు..

bcci-lodha-supreme-court-apnewsonline

రాజకీయ నాయకులు వేయని వేషం లేదు.. చొరబడని రంగం లేదు.. అందుకే దేశం ఇలా తగలబడింది. రాజకీయ నాయకుల ప్రవేశంతో క్రీడలు కూడా రాజకీయంగా మారి తమ తమ ఆప్తులకు అగ్రపీఠం ఇప్పించి నాణ్యమైన క్రీడాకారులను తొక్కేస్తున్నారు. అందుకే దీనిపై సుప్రీం కోర్టు కన్నెర్రచేసింది. బీసీసీఐలో సంస్కరణలు, రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు మాజీ న్యాయమూర్తి లోథాతో కమిటీ వేసింది. ఆయన చేసిన సిఫారసులను అమలుచేయాలని బీసీసీఐని స్తంభింపచేసింది.
లోథా సిఫారుల ప్రకారం రాజకీయ నాయకులకు బీసీసీఐలో ప్రవేశం కష్టం.. మాజీ క్రికెటర్లే పాలించాలి. అందునా మూడేళ్లకు మించి పనిచేయరాదు. దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేగా ఉంటే బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఇలా బీసీసీఐ ప్రక్షాళనకు తీసుకున్న నిర్ణయాలను బోర్డు అమలు పరచలేదు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం కొరఢా ఝలిపించింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను సస్పెండ్ చేసింది.వెంటనే క్రికెటర్లను అధ్యక్షుడిగా నియమించాలని కమిటీ ఏర్పాటు చేసింది.
కాగా అధికార బీజేపీ అండదండలతో ఆ పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బీసీసీఐని ఏలుతున్నాడు. వేల కోట్ల ఆదాయం వచ్చే బీసీసీఐని సాంతం వాడుకుంటున్నారు. సుప్రీంకోర్టు రంగప్రవేశంతో బీజేపీకి, ఇతర రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగింది .. దేశంలోని క్రీడల్ని రాజకీయలనుంచి దూరం చేసిన సుప్రీం నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ హర్షిస్తున్నారు.

To Top

Send this to a friend